BigTV English

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన..  రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్,  ఇంతకీ ఎవరామె?

Chennai News: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించింది. ఇంతకీ జస్టిస్ అరుణ జగదీశన్ ఎవరు? ఇలాంటి సున్నితమైన కేసు దర్యాప్తు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక కేసులు విచారించారు.. దర్యాప్తు చేశారు కూడా. ఆమె కేసులో విషయానికి వద్దాం.


శనివారం రాత్రి కరూర్‌లో తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేయడానికి జస్టిస్ అరుణా జగదీశన్ (రిటైర్డ్) నేతృత్వంలో ఓ కమిషన్‌ను నియమించింది స్టాలిన్ ప్రభుత్వం. మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి ఆమె. జస్టిస్ అరుణ్ జగదీశన్ తమిళనాడులో అనేక ఉన్నతస్థాయి విచారణ కమిషన్లకు నాయకత్వం వహించారు. 2009 నుండి 2015లో పదవీ విరమణ చేసే వరకు మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఆమె పని చేశారు.

కరూర్‌లో టీవీకె పార్టీ శనివారం ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది గాయపడ్డారు. తమిళనాడు డీజీపీ వెంకటరామన్ మాట్లాడుతూ ఊహించిన సంఖ్యలో ప్రజలు రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని మోహరించామన్నారు.


నాయకుల వెర్షన్ ఒకలా.. పోలీసుల వెర్షన్ మరోలా ఉండడంతో స్టాలిన్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించారు. అరుణ విచారించిన కేసు విషయానికి వద్దాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆమె సహచరులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును జస్టిస్ అరుణ విచారించారు.

ALSO READ: విజయ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్

జస్టిస్ అరుణ హైకోర్టులో పని చేస్తున్నప్పుడు ఓ కేసులో చెన్నై పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2015లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మరణించారు. వారంతా బ్యాంకును దోచుకున్నారని ఆరోపించారు. చాలా మంది నకిలీ ఎన్‌కౌంటర్ అని ఆరోపించారు. చివరకు ఈ వ్యవహారం హైకోర్టుకి చేరింది. ఆ సమయంలో పోలీసులకు జస్టిస్ అరుణ బెంచ్ క్లీన్‌చిట్ ఇచ్చింది.

2018 ఏడాది తమిళనాడులోని టుటికోరిన్‌లో జరిగిన స్టెర్లైట్‌ పరిశ్రమకు వ్యతిరేక నిరసన జరిగింది. ఆ సందర్భంగా హింస చెలరేగింది. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించారు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను జస్టిస్ అరుణ్‌కు అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ఓ ఐపీఎస్ అధికారితో సహా 17 మంది పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని ఆమె నేతృత్వంలో ఏర్పడిన కమిషన్ సిఫార్సు చేసిన విషయం తెల్సిందే.

2002లో ఓ దళిత మహిళ కస్టోడియల్ మరణం కేసులో సంచలన తీర్పు ఇచ్చారు. బాధితురాలిపై జరిగిన హింసపై ప్రజల ఆగ్రహం ఉన్నప్పటికీ, తగినంత ఆధారాలు లేకపోవడంతో దిగువ కోర్టు శిక్షను రద్దు చేశారు. ఎనిమిది మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెల్సిందే.

Related News

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Big Stories

×