Euphoria: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్(Guna Sekhar) ఒకరు. గుణశేఖర్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇటీవల గుణశేఖర్ సినిమాలు ప్రేక్షకులను కాస్త నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి. గుణశేఖర్ చివరిగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి యుఫోరియా(Euphoria) అనే సినిమాని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా కొంతమేర షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. అయితే డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా నేటితరం యువత ఎక్కువగా ఇలాంటి వాటికి బానిస అవుతున్న నేపథ్యంలో యువత కోసమే ప్రత్యేకంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మూడు సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటాయని ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా మారనున్నాయని తెలుస్తోంది.
ఇలా గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ చిత్రాన్ని స్వయంగా గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, రాగిణి గుణ నిర్మించబోతున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. ఇక ఇందులో విగ్నేష్ గవిరెడ్డి(Vignesh Ghavi reddy) హీరోగా సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ పై గుణశేఖర్ ప్రత్యేకంగా శ్రద్ధపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నేటి యువత అలవాట్లను ప్రతిబింబించేలా ఓ పాట కూడా ఉండబోతుందని ఈ పాట సినిమాకి హైలైట్ గా మారనుందని తెలుస్తోంది.
కొత్త వారితో గుణశేఖర్ ప్రయోగం..
ఇక ఈ సినిమా ద్వారా గుణశేఖర్ దాదాపు 20 మంది వరకు కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మొదట్లో సుమారు 15 కోట్ల బడ్జెట్ కేటాయించారు అయితే ఇది కాస్త 9 కోట్లకు వచ్చింది ఇప్పుడు మాత్రం 7.20 కోట్లకు వచ్చింది. ఈ లెక్క ఫస్ట్ కాపీకి వర్క్ అవుట్ అవుతుందా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా యువతను ఆకట్టుకోవడం కోసం యువత అలవాట్లను ప్రతిబింబిస్తూ గుణశేఖర్ చేయబోతున్న ఈ ప్రయోగం ఇంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. గుణశేఖర్ సినిమాలను తన కుమార్తె నీలిమ గుణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?