E-Paper
Advertisement

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి
Advertisement

PF transfer after changing jobs| ఉద్యోగం మారినప్పుడు కొత్త కంపెనీలో చేరడం, జీతం వివరాలు అప్‌డేట్ చేయడం వంటి పనుల్లో బిజీగా ఉంటారు. కానీ, మీ పాత ఉద్యోగంలో జమ అయిన ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్ – PF) డబ్బును కూడా గుర్తుంచుకోవాలి. కొత్త కంపెనీలో చేరగానే పాత పిఎఫ్ మొత్తం ఆటోమేటిక్‌గా బదిలీ అయిందని అనుకోవద్దు. మీ ఖాతాలో డబ్బు సరిగ్గా క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.

కొందరికి UMANG యాప్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పిఎఫ్ అకౌంట్లు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఒకే వ్యక్తికి రెండు UAN నంబర్లు ఉంటే మాత్రం సంబంధిత అధికారులను సంప్రదించాలి. మీ పిఎఫ్ డబ్బు, ఉద్యోగ వివరాలు సక్రమంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి.

UAN, పిఎఫ్ మెంబర్ ఐడీ మధ్య తేడా

Advertisement

UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇది మీ పిఎఫ్ అకౌంట్‌లకు సంబంధించిన శాశ్వత గుర్తింపు నంబర్. పిఎఫ్ మెంబర్ ఐడీ మాత్రం ఒక్కో ఉద్యోగానికి సంబంధించిన ఖాతాను గుర్తిస్తుంది. మీరు ఉద్యోగం మారినప్పుడు కొత్త కంపెనీ మరో మెంబర్ ఐడీని కేటాయించవచ్చు. ఒకే UAN కింద అనేక మెంబర్ ఐడీలు ఉండటం సాధారణమే. అయితే, ఒకే వ్యక్తికి రెండు UAN నంబర్లు కేటాయిస్తే వాటిని సరిచేయించుకోవాలి.

ఉద్యోగం మారిన తర్వాత ఈ మూడు వివరాలను చెక్ చేయాలి

1. పాత ఉద్యోగం ముగిసిన తేదీని చెక్ చేయండి

మీరు పాత కంపెనీలో పనిచేసిన చివరి రోజు తేదీని EPFO రికార్డుల్లో సరిగా నమోదు చేశారో లేదో చూడండి. ఈ వివరాలు తప్పుగా ఉన్నా, నమోదు కాకపోయినా పిఎఫ్ బదిలీ ఆలస్యం కావచ్చు. అర్హత ఉన్న ఉద్యోగులు EPFO నిబంధనల ప్రకారం తమ ఎగ్జిట్ తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు.

2. మీ పిఎఫ్ పాస్‌బుక్‌ పరిశీలించండి

Advertisement

అధికారిక EPFO పాస్‌బుక్ పోర్టల్‌లోకి వెళ్లి మీ ఖాతా వివరాలను చెక్ చేయండి. పాత కంపెనీ, కొత్త కంపెనీ జమ చేసిన మొత్తాలను పరిశీలించండి. పాత పిఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు బదిలీ అయిందని నిర్ధారించుకోవడానికి ట్రాన్స్‌ఫర్ ఎంట్రీలను కూడా చూడండి.

3. పిఎఫ్ బదిలీ స్టేటస్ తెలుసుకోండి

పాత పిఎఫ్ మొత్తం కొత్త ఖాతాలో కనిపించకపోతే ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ స్థితిని పరిశీలించండి. అవసరమైతే ఆన్‌లైన్‌లో ఫామ్ 13 ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అర్హతను బట్టి యజమాని అనుమతి లేకుండానే క్లెయిమ్ EPFOకు చేరుతుంది.

ఒకే వ్యక్తికి రెండు UAN నంబర్లు ఉంటే ఏం చేయాలి?

మీ పేరుతో రెండు UAN నంబర్లు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే ప్రస్తుత కంపెనీకి తెలియజేసి EPFOను సంప్రదించండి. రెండు నంబర్ల వివరాలను అందించి రికార్డులను సరిచేయించుకోండి. పరిశీలన తర్వాత అవసరమైతే పాత UANను బ్లాక్ చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యే వరకు కొత్త ఖాతాను సృష్టించడం లేదా పాత డబ్బును విత్‌డ్రా చేయడానికి తొందరపడడం లాంటివి చేయకండి.

Also Read: మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

తెలియని పిఎఫ్ ఖాతా కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి

మీరు పనిచేయని కంపెనీ పేరు మీద పిఎఫ్ మెంబర్ ఐడీ కనిపిస్తే, దాని వివరాలను పరిశీలించండి. తప్పుగా లింక్ అయినట్లు లేదా మోసం జరిగినట్లు అనిపిస్తే EPFO అధికారిక ఫిర్యాదు వ్యవస్థను ఉపయోగించండి. మీ పాస్‌వర్డ్, ఆధార్ వివరాలు, ఓటీపీలను అపరిచితులతో షేర్ చేసుకోవద్దు.

Also Read: భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

పిఎఫ్ డబ్బును ట్రాన్స్‌ఫర్ బదిలీ చేయడం ఎందుకు ముఖ్యం?

పాత పిఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయడం వల్ల మీ సేవింగ్స్ ఒకే చోట పర్యవేక్షించడం సులభం అవుతుంది. అలాగే, ఉద్యోగ సర్వీస్ వివరాలు, పెన్షన్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి, ప్రతిసారీ ఉద్యోగ మార్పు తర్వాత మీ పిఎఫ్ బ్యాలెన్స్, UAN, ట్రాన్స్‌ఫర్ స్టేటస్‌ని తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఇప్పుడే వివరాలు పరిశీలిస్తే భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.

Related News

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

Big Stories

Advertisement
×