Virender Sehwag On Mohammed Shami: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య త్వరలో జరగబోయే వన్డేలు, టెస్టుల కోసం తాజాగా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ రెండు సిరీస్ లలో కూడా మహమ్మద్ షమీకి ( Mohammed Shami) మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో మహమ్మద్ షమీ అభిమానులు డీలా పడిపోయారు. ఇంకెన్ని రోజులు వేచి చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే మహమ్మద్ షమీని తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహమ్మద్ షమీ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా దండగే, బ్యాగులు సర్దుకొని రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ సంచలన ప్రకటన చేశారు. లేకపోతే ప్రాక్టీస్ మానేసి, గౌతమ్ గంభీర్ భజన చేస్తే బెటర్ అంటూ సూచనలు చేశారు. అప్పుడైనా టీమిండియా నుంచి పిలుపు వస్తుందేమోనని సెటైరికల్ కామెంట్స్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. 35 ఏళ్లు దాటిన మహమ్మద్ షమీని ఇంకెన్ని రోజులు సెలక్ట్ చేయకుండా ఉంటారంటూ బీసీసీఐపై మండిపడ్డారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహమ్మద్ షమీ అవసరం టీమిండియాకు ఉందని… అలాంటోడిని తీసుకోకపోతే ట్రోఫీ ఎలా కొడతారు అంటూ నిలదీశారు. దీంతో వీరేంద్ర సెహ్వా్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ సిరీస్ ల కోసం గౌతమ్ గంభీర్ కు నచ్చిన వాళ్లను మాత్రమే సెలెక్ట్ చేశారని వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, అకీబ్ నబీ లాంటి బచ్చా బౌలర్లను ఎందుకు సెలెక్ట్ చేశారని ఆగ్రహించారు. దిక్కుమాలిన వాళ్లను తీసుకొని మహమ్మద్ షమీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. భువనేశ్వర్ కుమార్ ఈ20లకు రీ-ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మహమ్మద్ షమీకి కూడా పిలుపు వస్తుందని అందరూ భావించారని వివరించారు.
కచ్చితంగా టెస్టులు లేదా వన్డేలలో మహమ్మద్ షమీకి అవకాశం వస్తుందని తాను కూడా అనుకున్నట్టు పేర్కొన్నారు. కానీ గౌతమ్ గంభీర్ కుట్రల వల్ల అతనికి అవకాశం రాలేదని తాను అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. యువ బౌలర్లు దారాళంగా పరుగులు ఇస్తున్నప్పటికీ మళ్లీ వాళ్లకే అవకాశాలు ఇవ్వడం ఏంటి ? అని ప్రశ్నించారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ను దృష్టిలో పెట్టుకొని మహమ్మద్ షమీని సెలెక్ట్ చేయాల్సి ఉంది.. కానీ ఈ సెలెక్టర్లు ఏం పీకుతున్నారు అర్థం కావడం లేదని ఆగ్రహించారు. తన ఆలోచన ప్రకారం మహమ్మద్ షమీ రిటైర్మెంట్ ఇచ్చి, ఇంట్లోనే కూర్చోవడం బెటర్ అన్నారు.