E-Paper
Advertisement

Most Gold mines: ఈ 7 దేశాల్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ మైన్స్.. టాప్‌లో ఉన్న కంట్రీ ఏదో తెలుసా..?

Most Gold mines: ఈ 7 దేశాల్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ మైన్స్.. టాప్‌లో ఉన్న కంట్రీ ఏదో తెలుసా..?
Advertisement

బంగారం.. గోల్డ్.. పసిడి… స్వర్ణం.. దీనికి ఉన్న క్రేజ్ మరేదానికి ఉండదేమో అంటే అతిశయోక్తి కాదేమో.. గోల్డ్ ధర వేలల్లో.. లక్షల్లో పెరిగినా కొనేందుకు మాత్రం ఎవరు భయపడరు.. అది బంగారం వాల్యూ అంటే….. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ మార్కెట్ కు ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు బంగారు గనులను గుర్తిస్తున్నాయి. అయితే.. గనుల తవ్వకం, ఉత్పత్తి కేవలం కొన్ని దేశాల వద్దే కేంద్రీకృతమవుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహాలు, జాతీయ వ్యూహాలు కొత్త రూపు దాల్చుతున్నాయి. స్టాటిస్టా విడుదల చేసిన 2024 తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 3,300 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తి కాగా.. అందులో ప్రధాన వాటా కేవలం ఏడు దేశాల నుంచే లభిస్తోంది.

పర్యావరణ నిబంధనలు, భౌగోళిక సవాళ్లు, పెట్టుబడి చక్రాల ప్రభావంతో ఉత్పత్తి రంగంలో అసమానతలు కనిపిస్తున్నప్పటికీ.. గోల్డ్ మార్కెట్ లో చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కొత్త నిక్షేపాల ఆవిష్కరణలు తగ్గిపోవడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తికి ఉన్న ప్రాధాన్యత మరింత పెరుగుతోంది.

Advertisement

అగ్రస్థానంలో దూసుకెళ్తున్న చైనా, రష్యా..

2024లో చైనా 370 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా నిలిచింది. షాన్‌డాంగ్, హెనాన్, ఇన్నర్ మంగోలియా వంటి ప్రావిన్స్‌లలో ఉత్పత్తి కేంద్రీకృతమైంది. పర్యావరణ నిబంధనల దృష్ట్యా చిన్న చిన్న గనులను మూసివేసి, పెద్ద గనులతో విలీనం చేయడం ద్వారా చైనా తన సామర్థ్యాన్ని పెంచుకుంది. ఆభరణాలు, సాంకేతిక రంగం, రిజర్వ్ మేనేజ్‌మెంట్ నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ చైనా ఉత్పత్తికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Advertisement

310 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రష్యా సెకండ్ ప్లేస్..

రష్యా 310 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. సైబీరియాలోని ఒలింపియాడ్ వంటి భారీ గనుల ద్వారా రష్యా తన పట్టును నిలుపుకుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ.. రష్యా తన బంగారాన్ని దేశీయ ఆర్థిక సంస్థలకు లేదా ఇతర మార్కెట్లకు తరలిస్తూ స్థిరత్వాన్ని చాటుకుంది.

మూడో స్థానంలో ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మూడవ స్థానంలో నిలిచింది. బాడింగ్టన్, కాడియా వంటి భారీ ఓపెన్-పిట్ గనుల ద్వారా ఈ ఉత్పత్తి సాధ్యమైంది. విశేషమేమిటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా గుర్తించబడిన బంగారు నిక్షేపాలు ఆస్ట్రేలియాలోనే ఉండటం గమనార్హం.

నాలుగో స్థానంలో కెనడా..

కెనడా 200 మెట్రిక్ టన్నులతో నాలుగో స్థానంలో ఉంది. అంటారియో, క్యూబెక్ రాష్ట్రాల్లోని అనుకూల వాతావరణం, పెట్టుబడి స్నేహపూర్వక విధానాల వల్ల కెనడా ఎగుమతి ఆధారిత ఉత్పత్తిలో రాణిస్తోంది.

ఐదో స్థానంలో అమెరికా.. 

అటు అమెరికా 170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా మొత్తం ఉత్పత్తిలో 75 శాతం కేవలం నెవాడా రాష్ట్రం నుంచే రావడం విశేషం.

ఆరో స్థానంలో కజకిస్తాన్..

పారిశ్రామిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులతో కజకిస్తాన్ 130 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించి ఆరో స్థానంలో నిలిచింది. ఆధునిక మైనింగ్ చట్టాలు ఈ దేశానికి ఊతమిచ్చాయి.

ఏడో స్థానంలో మెక్సికో..

ఇక మెక్సికో 120 మెట్రిక్ టన్నులతో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఇటీవలి నియంత్రణ మార్పుల వల్ల అక్కడ పెట్టుబడిదారుల్లో కొంత అనిశ్చితి నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 64,000 మెట్రిక్ టన్నుల వెలికితీయదగిన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధిక భాగం ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, చైనాలలో ఉన్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచ బంగారు డిమాండ్ 4,606 మెట్రిక్ టన్నులుగా ఉంది. కరెన్సీ అస్థిరత, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

చివరగా..  గనుల తవ్వకం రోజురోజుకూ సంక్లిష్టమవుతోంది. లోతైన తవ్వకాలు, ఇంధన, నీటి వ్యయాలు పెరగడం, పర్యావరణ అనుమతులకు సమయం పట్టడం వంటి సవాళ్లు మైనింగ్ కంపెనీలను ఎదురుచూసేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఏడు దేశాల నిర్ణయాలే ప్రపంచ బంగారు ధరలను, సరఫరాను శాసించనున్నాయి.

ALSO READ: Indian Currency: ఒక్క రూ.500 నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×