E-Paper
Advertisement

Dubai Gold Prices: యుద్ధం ఎఫెక్ట్.. చౌకగా బంగారం.. తక్కువకే ఇచ్చేస్తున్న వ్యాపారులు!

Dubai Gold Prices: యుద్ధం ఎఫెక్ట్.. చౌకగా బంగారం.. తక్కువకే ఇచ్చేస్తున్న వ్యాపారులు!
Advertisement

Dubai Gold Prices: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో బీతావాహ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ ఇరాన్.. డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడుతోంది. దీంతో దుబాయి బంగారం మార్కెట్‌లో వింతైన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బంగారం ధరలు పెరగాల్సిన ప్రస్థుత పరిస్థితుల్లో.. దుబాయిలో మాత్రం ధరలు భారీగా తగ్గాయి. ఊహించని డిస్కౌంట్ లు అందిస్తూ బంగారాన్ని అక్కడి వ్యాపారులు విక్రయిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

బంగారం క్రయ, విక్రయాలకు ప్రపంచస్థాయి వాణిజ్య కేంద్రంగా దుబాయి ఉంది. ఇక్కడ నుంచే భారీ ఎత్తున బంగారం ఇతర దేశాలకు విమానాల ద్వారా ఎగుమతి అవుతుంటుంది. అయితే యుద్ధం కారణంగా గగనతలంపై ఆంక్షలు విధించడం, విమానాలు రద్దు కావడంతో బంగారం నిల్వలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఫైనాన్స్ ఖర్చు భరించలేక..

Advertisement

పాత బంగారం ఆర్డర్లను సైతం సప్లే చేసే పరిస్థితులు కనిపించడం లేదని దుబాయి గోల్డ్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా యుద్ధ భయాలతో వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు వాపోతున్నారు. దీనికి తోడు కొత్త ఆర్డర్ లు లేక బంగారం నిల్వలు పెరుకుపోతున్నట్లు వ్యాపారులు తెలియజేస్తున్నారు. దీంతో వాటిని భద్రపరిచే ఖర్చు (Storage costs), ఫైనాన్సింగ్ ఇబ్బందులు భరించలేక డిస్కౌంట్లకు బంగారం ఇచ్చేందుకు అక్కడి వ్యాపారులు సిద్ధపడుతున్నారు.

30 డాలర్ల తగ్గింపు..

అంతర్జాతీయ మార్కెట్ (లండన్ బెంచ్ మార్క్) ధరతో పోలిస్తే.. దుబాయ్‌ వ్యాపారులు ఔన్స్ బంగారంపై 30 డాలర్ల వరకు తగ్గింపు ఇస్తున్నారు. కొందరైతే నిర్దిష్ట కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు సైతం అందిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో స్థానికులు ఇదే మంచి ఛాన్స్ అని పెద్ద ఎత్తున బంగారాన్ని కొని.. సేవింగ్స్ రూపంలో భద్రపరుచుకుంటున్నట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: Sundar Pichai: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ జీతం.. ఒక దేశాన్నే కొనేయచ్చు భయ్యా!

భారత్‌పై ప్రభావం ఎంత?

ఇదిలా ఉంటే భారత్ తన బంగారం అవసరాల కోసం దుబాయ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ రవాణా సమస్యల వల్ల భారత మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ లభ్యత తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి బంగారంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. జనవరి నెలలో భారత్ కు దిగుమతులు జరిగాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బంగారం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ యుద్ధం, రవాణా సమస్యలు మరికొన్ని నెలల పాటు కొనసాగితే భారత్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Alappuzha Railway Station: రైలు కోచ్ కింద.. మానవ శరీర భాగాలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!

Related News

PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

డిగ్రీ లేదు.. పెట్టుబడి లేదు.. రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న 65 ఏళ్ల మహిళ

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×