E-Paper
Advertisement

Alappuzha Railway Station: రైలు కోచ్ కింద.. మానవ శరీర భాగాలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!

Alappuzha Railway Station: రైలు కోచ్ కింద.. మానవ శరీర భాగాలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!
Advertisement

Alappuzha Railway Station: కేరళలోని అలప్పుజ రైల్వే స్టేషన్ లో (Alappuzha Railway Station) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ లో ఆగి ఉన్న ధనాబాదా ఎక్స్ ప్రెస్  (Alappuzha–Dhanbad Express) రైలు కోచ్ కింద మానవ శరీర భాగాలు ఉండటం రైల్వే అధికారులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఈ విషయం తెలిసి స్టేషన్ లోని ప్రయాణికులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ శరీర భాగాలు ఎవరివి? కోచ్ కిందకు ఎలా వచ్చాయి? అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే?

అలప్పుజ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అలప్పుజ – ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352) రైలు శుక్రవారం సాయంత్రం ఝార్ఖండ్ నుండి అలప్పుజ చేరుకుంది. శనివారం ఉదయం రైలును శుభ్రం చేస్తున్న సమయంలో S 5 కోచ్ కింద ఉన్న ఐరన్ బ్రాకెట్‌కు ఒక వ్యక్తి కుడి చేయి, కాలి వేలు ఇరుక్కుపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సిబ్బంది.. స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ప్రమాదం ఎక్కడ జరిగింది?

Advertisement

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ శరీర భాగాలు ఎవరివి? ఎక్కడ ప్రమాదం జరిగింది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ రైలు జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆయా రాష్ట్రాల పోలీసులను కూడా అధికారులు సంప్రదిస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆ మార్గంలో ఎక్కడైనా రైలు ప్రమాదాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయా అని తనిఖీ చేస్తున్నారు.

Also Read: Washing Machine Tips: వాషింగ్ మిషన్‌లో.. బట్టలతో పాటు ఇవి కూడా వేస్తున్నారా? కొంపలు అంటుకుంటాయ్ జాగ్రత్త!

ప్రాథమిక అంచనా ఏంటంటే?

Advertisement

ప్రస్తుతం మానవ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. రైలు ప్రయాణించిన మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ శరీర భాగాలు కోచ్ కింద ఇరుక్కుపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో కూడా ఇదే స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్‌పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×