E-Paper
Advertisement

Mahidra Batman Bookings: మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈజ్ బ్యాక్.. ఈసారి 999 మందికి ఛాన్స్

Mahidra Batman Bookings: మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఈజ్ బ్యాక్.. ఈసారి 999 మందికి ఛాన్స్
Advertisement

Mahidra Batman Bookings: మహీంద్రా కార్లలో మోస్ట్ అట్రాక్టివ్ BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ బుకింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కస్టమర్ల డిమాండ్ మేరకు మహీంద్రా కంపెనీ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. లిమిటెడ్ ఎడిషన్ అయిన బ్యాట్ మ్యాన్ ఎలక్ట్రిక్ SUV బుకింగ్స్ తిరిగి ప్రారంభిస్తున్నామని మహీంద్రా కంపెనీ పేర్కొంది. బ్యాట్ మ్యాన్ ఎడిషన్ లో 999 కార్లు కేవలం 135 సెకన్లలో అమ్ముడయ్యాయి. దీంతో చాలా మంది బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

బుకింగ్స్ మళ్లీ ఓపెన్ చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్టులు వస్తుండడంతో.. మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి అభివృద్ధి చేయబడిన ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 28.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో టాప్-ఎండ్ ప్యాక్ త్రీ వేరియంట్ లలో రూపొందించారు.

బుకింగ్స్, డెలివరీ

Advertisement

మహీంద్రా అధికారిక వెబ్‌సైట్‌లో.. మార్చి 6, 2026 నుంచి ‘యాడ్ యువర్ ప్రిఫరెన్స్ ‘ విండో ద్వారా కస్టమర్ల రిక్వెస్టులను అంగీకరిస్తుంది. బుకింగ్‌లను మార్చి 10 ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ బుకింగ్స్ ఒక రోజు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి. ఏప్రిల్ 10 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

బ్యాట్‌మ్యాన్ డిజైన్

BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ డిజైన్ ను క్రిస్టోఫర్ నోలన్ ది డార్క్ నైట్ ట్రైలజీ నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు. కారు బయట, లోపలి భాగాలను స్టైలిష్ గా రూపొందిస్తున్నారు. BE 6 ఎలక్ట్రిక్ SUV కోర్ డిజైన్‌ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

హైలెట్స్ ఇవే

  • కస్టమ్ శాటిన్ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్
  • ఫ్రంట్ డోర్స్ బ్యాట్‌మ్యాన్ డెకాల్స్
  • 20 అంగుళాల అలాయ్ వీల్స్
  • ఆల్కెమీ గోల్డ్-పెయింటెడ్ సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్స్
  • BE 6 × ది డార్క్ నైట్ లిమిటెడ్ ఎడిషన్ రియర్ బ్యాడ్జింగ్
  • హబ్ క్యాప్స్, క్వార్టర్ ప్యానెల్స్, రియర్ బంపర్
  • గ్లాస్ లపై బ్యాట్ ఎంబ్లెమ్ ప్లేస్‌మెంట్
  • బ్యాట్ ఎంబ్లెమ్‌ తో ఇన్ఫినిటీ రూఫ్
  • ప్రొజెక్టెడ్ బ్యాట్‌మ్యాన్ లోగో కార్పెట్ ల్యాంప్స్

థీమ్డ్ ఇంటీరియర్

Advertisement

కారు లోపల, బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ డార్క్ నైట్ థీమ్ తో డిజైన్ చేశారు. మహీంద్రా కస్టమ్ బ్యాట్‌మ్యాన్ ఇన్పిరేషన్ తో ఇంజిన్ సౌండ్‌లను కూడా రూపొందించారు.

Also Read:  ఇవి కార్లా లేక మైలేజ్ మెషీన్లా? ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేయనున్న 8 హైబ్రిడ్ కార్లు ఇవే!

ఇంటీరియర్ హైలైట్‌లు

  • డ్యాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్
  • డ్రైవర్ కాక్‌పిట్ చుట్టూ గోల్డ్ హాలో యాక్సెంట్‌లతో చార్‌కోల్ లెదర్ డాష్‌బోర్డ్
  • గ్లోడ్ యాక్సెంట్ స్టిచింగ్‌తో స్వెడ్, లెదర్ అప్హోల్స్టరీ
  • సీట్లపై బ్యాట్ సింబల్, బూస్ట్ బటన్ , ఇంటీరియర్ లేబుల్స్
  • గోల్డ్ యాక్సెంట్ స్టీరింగ్ వీల్, కంట్రోల్ ఎలిమెంట్స్
  • ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో కస్టమ్ బ్యాట్‌మ్యాన్
  • బ్యాట్‌మ్యాన్ బ్రాండింగ్‌తో రేస్ డోర్ స్ట్రాప్‌లు

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×