E-Paper
Advertisement

Gold and Silver Prices: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold and Silver Prices: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Advertisement

Gold and Silver Prices Today in India: బంగారం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. దేశంలో బంగారం, వెండి ధరలు భారీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.వెయ్యికి పైగా బంగారం ధరలు అమాంతం పెరగడంతో మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. ఇక, పండగలు, పెళ్లిళ్ల సమయాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఎగబడుతుంటారు. అయితే గత కొంతకాలంగాపెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి.

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,300 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్‌లో రూ. 68,250చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,450 పలుకుతోంది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ..తగ్గుతూ వస్తున్నాయి. కానీ శుక్రవారం రూ.1300 పెరగడంతో తులం బంగారం రూ.75వేల వరకు చేరింది.

Advertisement

బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరగగా.. నేడు ఊహించని విధంగా ఏకంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200.. 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.1,300 పెరిగింది. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉన్నందున తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే మన దేశంలో బంగారం పెరగడానికి మరో కారణం ఏంటంటే.. వరుసగా దసరా, దీపావళి, ధన త్రయోదశి, పెళ్లిళ్ల సీజన్ వస్తున్న తరుణంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

ఇక, వెండి విషయానికొస్తే.. వెండి ధరలు కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇవాళ ఏకంగా కిలో వెండిపై రూ.3000 పెరిగింది. దీంతో మార్కెట్‌లో కిలో వెండి 89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలలో కిలో వెండి రూ.95వేలకు చేరువలో ఉంది.

Also Read: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,600 ఉంది. ఇక, చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం దర రూ.68,250 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,450గా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో బంగారం ధరలను పోల్చితే.. దేశ రాజధాని ఢిల్లీలోనే అధిక ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. వెండి ధరలు మాత్రం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.95వేల వరకు ఉన్నాయి. ఈ ధరలు ఇలాగే కొనసాగితే..రానున్న రోజుల్లో కేజీ వెండి ధర రూ.లక్ష వరకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×