BigTV English

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ భూములపై దృష్టి సారించిందా? ఈ మధ్యకాలంలో భూములను ఎందుకు కొనుగోలు చేస్తోంది? కేవలం మేజర్ సిటీలపై దృష్టి పెడుతోందా? ఇండియా తన వ్యాపారాన్ని భారీగా విస్తరించే ప్లాన్ చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన సామ్రాజాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు కొన్ని సిటీలకే పరిమితమైన ఈ కంపెనీ.. అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతోంది. ఇండియాలోని మేజర్ సిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, పూణె, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సిటీల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అంతేకాదు ఆయా నగరాల్లో డేటా సెంటర్లను విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా హైదరాబాద్, పూణె నగరాల్లో ఖరీదైన భూములను కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం ఒక్క పూణెలో 848 కోట్లతో భూములను కొనుగోలు చేసింది.

ఇందులో భాగంగా పూణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల ల్యాండ్‌ని కొనుగోలు చేసింది మైక్రోసాప్ట్. ఏకంగా 520 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇండో ఇన్పోటెక్ సిటీ నుంచి ఈ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ 31 కోట్ల పైచిలుకు కాగా, రిజిస్ట్రేషన్ ఫీజు 30 వేల రూపాయలు. అయితే ఈ ఒప్పందంపై మైక్రోసాప్ట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.


ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ కంపెనీ. ఇందుకోసం 267 కోట్ల రూపాయలు వెచ్చించింది. రంగారెడ్డి జిల్లా సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి ఈ స్థలాన్ని కొన్నట్లు డేటా ఎనలిటికల్స్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో డేటా సెంటర్‌ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.

ALSO READ:  హాట్ బాత్, విమానం తరహా సౌకర్యాలు.. ‘వందే భారత్’ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు!

రెండేళ్ల కిందట పూణెలోని పింప్రి-చించ్ వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. దాని విలువ అక్షరాలా 328 కోట్లు రూపాయలు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి ఏఐ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాప్ట్‌కు దేశవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులున్నారు.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×