BigTV English

Turmeric Water For Weight Loss: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్ ఇదే !

Turmeric Water For Weight Loss: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్ ఇదే !

Turmeric Water For Weight Loss: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో నానాపాట్లు పడుతున్నారు. స్థూలకాయం అనేది శరీరానికి ఆకృతి లేకుండా చేస్తుంది. అంతే కాకుండా అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల పద్దతులు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించడంలో పసుపు వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే లక్షణాలు కొవ్వులో తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.


పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది కొవ్వు కణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియను పెంచడంలో ఉపయోగపడుతుంది.

పసుపు నీటిని తయారు చేయు విధానం:


పసుపు నీటిని తాయారు చేయడానికి ముందుగా 1 గ్లాస్ నీటిని వేడి చేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపును నీటిలో వేసి కలపాలి. రుచి కోసం కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తరుచుగా ఈ నీరు త్రాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

నీరు: ప్రతి రోజు శరీరానికి తగినంత నీరు త్రాగడం అవసరం. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ఆకలిని తగ్గించడంతో పాటు జీవక్రియను పెంచడంలో దోహదం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు, నిమ్మరసం, తేను కలిపి తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.

Also Read:  నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా?.. ఈ డిటాక్స్ డ్రింక్ తో కరిగించేయండి..

ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలతో పాటు జంక్ ఫుడ్ , చెక్కెరలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఒకే సారి ఎక్కువ ఆహారాన్ని తినకూడదు. నెమ్మదిగా తినాలి. జంక్ ఫుడ్ వంటివి తినకుండా  ఉండాలి. బరువు తగ్గాలి అనుకునే వారు పోషకాహారం ఉన్న ఫుడ్ తినాలి.  అంతే కాకుండా ఆహారం తినడం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా నమిలి ఆహారాన్ని తినాలి. ఫుడ్ తో పాటు తరుచుగా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారు. నడక లేదా ఈత ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. ప్రతి వారం 150 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం వల్ల బరువు తగ్గుతారు. ఇది కేలరీలను బర్న్ చేయడంలో ప్రభావవంతగా ఉంటుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Big Stories

×