E-Paper
Advertisement

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?
Advertisement

Gold Rate Today: ప్రపంచ పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడింది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ సంఘర్షణ, ఆపై ఇరాన్ కువైట్‌పై దాడి చేయడంతో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఘర్షణలు ఎక్కువ కాలం కొనసాగవని ట్రంప్ స్పష్టం చేయడంతో గురువారం భారత దేశ రిటైల్ మార్కెట్‌లో పసిడి రేటు మళ్లీ పెరిగింది.

 

ట్రంప్ ప్రకటనతో మళ్లీ బంగారానికి రెక్కలు

Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బంగారం-వెండి ధరలు దిగివస్తున్నాయి. ఫలితంగా మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో బులియన్ మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వరుసగా ఐదో రోజూ పసిడి- వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ యుద్ధం ఎక్కువకాలం సాగదన్న ప్రకటనతో విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 60 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం రేటు 4429 డాలర్ల స్థాయికి చేరి ట్రేడింగ్ కొనసాగుతోంది.

 

బంగారం-వెండి ధరల్లో హెచ్చుతగ్గులు

Advertisement

స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.96 శాతం పెరిగి 66 డాలర్ల పైకి దూసుకెళ్లింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 3న అంటే గురువారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతోపాటు మెట్రోనగరాల్లో బంగారం-వెండి రేట్లు ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 2070 మేర తగ్గి రూ.1,52,020 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1900 తగ్గి రూ.1,39,350 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,33,000 వద్ద ట్రేడవుతోంది.

 

దేశంలోని మెట్రో నగరాల్లో బంగారం ధరలు

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం రేటు రూ. 153,690 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140,883 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 153,950 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 141,121 ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం తులం రేటు రూ. 153,910 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 141,084 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం తులం రేటు రూ.153,590 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140,791 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం రూ. 154,240 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 141,387 వద్ద ఉంది. అటు వెండి ధరలు కూడా దాదాపుగా రే.2,33,000 వేలకు అటు ఇటు కొనసాగుతోంది.

ALSO READ: క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

Related News

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

Big Stories

Advertisement
×