South Africa: సౌతాఫ్రికాలో ఏం జరుగుతోంది? సున్తీల పేరుతో బాలురులు మరణాల వెనుక ఏం జరుగుతోంది? దీని కారణంగా ఒకేసారి 43 మంది మృత్యువాత పడ్డారా? ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదా? ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సున్తీ వల్ల చనిపోవడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ప్రిటోరియాకు ఉత్తరాన సుమారు 20 మైళ్ల దూరంలోవున్న సింక్వాబైల్ ప్రైమరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడ్ని పాఠశాల మరుగుదొడ్డిలో నలుగురు విద్యార్థులు రౌండప్ చేశారు. వారిలో ముగ్గురు.. ఆ బాలుడ్ని పట్టుకుని బలవంతంగా సున్తీ చేశారు. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే చంపేస్తామని సదరు బాలుడ్ని బెదిరించారు. భయపడిన ఆ బాలుడు ఇంటికి చేరుకున్నాడు, పాఠశాలలో జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత బాలుడు అదోలా నడవడం గమనించింది కన్న తల్లి. కొత్త ఫ్యాషన్ అంటూ తల్లి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు నొప్పి తీవ్రం కావడంతో పరిస్థితి విషమించింది.
మంచం మీద నుంచి కిందకు దిగలేని పరిస్థితి ఏర్పడింది. బడిలో తనకు జరిగిన విషయం తల్లికి చెప్పాడు. బాలుడి శరీరంపై వాపు కనిపించడంతో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లింది తల్లి. నలుగురు విద్యార్థులు బలవంతంగా సున్తీ చేసినట్లు తేలింది. దీంతో ఆ తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కొడుకు భద్రత గురించి భయపడి పాఠశాలకు పంపడానికి వెనుక అడుగు వేసింది. పోలీసుల సహాయంతో ఆ బాలుడు ఆ నలుగురు విద్యార్థులను గుర్తించాడు. దక్షిణాఫ్రికాలోని అబ్బాయిలకు చేసే సున్తీ అనే సాంప్రదాయ ఉంది. ఈ ఆచారాన్ని క్సోసా జాతి ప్రజలు పాటిస్తారు. ఈ విధంగా చేసే దాన్ని ఉల్వలుకో అని పిలుస్తారు. బాల్యం నుండి యవ్వనంలోకి బాలుడు మారే క్రమంలో ముఖ్యమైన దశగా చెబుతారు.
ఆ తరహా ఆచారం శీతాకాల, వేసవి పాఠశాలల సమయంలో ఏడాదికి రెండుసార్లు సున్తీ జరుగుతుంది. ఆ సమయంలో అబ్బాయిలకు సున్తీ చేసి.. సమాజంలో సంప్రదాయాలు, బాధ్యతల గురించి వివరించారు. సున్తీ చేసే శిబిరాలలో బాలురులు దాదాపు నెల రోజులు గడుపుతారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో సాంప్రదాయ సున్తీ వేడుకల సందర్భంగా 43 మంది బాలురు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వేడుక పిల్లల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. గతేడాది ఈ తరహా వేడుకల సమయంలో 93 మంది బాలురు మరణించారు. 11 మంది తమ శరీరంలోని కొంత భాగాన్ని కోల్పోయారు. శిక్షణ లేని వ్యక్తులు పిల్లలకు సున్తీ చేసే అనేక అక్రమ కేంద్రాలు నడుస్తున్నాయి. నాసిరకం పరికరాలు, వైద్యుల సంరక్షణ లేకపోవడం వంటి కారణాలతో ఇన్ఫెక్షన్లకు దారి తీసి కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు.
ALSO READ: ట్రంప్‌కు ఊహించని షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్
పిల్లలను రక్షించడానికి దక్షిణాఫ్రికా పోలీసులు అక్రమ సున్తీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు. 42 అక్రమ కేంద్రాలను మూసి వేసి దాదాపు 40 మందిని అరెస్టు చేశారు. సుమారుగా 180 మంది బాలురులను రక్షించారు. ఈ సంవత్సరం బాలురు మరణాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ 2026 నాటికి సున్నా మరణాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా, అది కాస్త విఫలమైంది.