Big Stories

Under 15 Lakh Best Car : రూ.15 లక్షల్లో బెస్ట్ కారు ఇదే.. ఒక్కసారి కొంటే చాలు!

Under 15 Lakh Best Car : మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? మంచి మైలేజ్, లుక్ ఉన్న వేరియంట్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మార్కెట్‌లో డజన్ల కొద్దీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో అన్నింటిలో మీరు అనుకున్న ప్రతి ఫీచర్ ఉండదు. కారు విషయంలో కొందరు మైలేజీలో, మరికొందరు లుక్స్‌లో నష్టపోతారు. అయితే మారుతి గ్రాండ్ విటారా ఈ జాబితాలో ఆల్ రౌండ్ కారు. ఒక్కసారి ఈ కారు కొంటే 15 ఏళ్ల వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు మంచి మైలేజ్, లుక్స్ చూడొచ్చు.

- Advertisement -

మారుతి సుజుకి గ్రాండ్ విటారా గతేడాది భారత మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది అనేక ఫీచర్లను కలిగి ఉన్న కారు. ఈ కారులో మంచి స్పేస్, మంచి డిజైన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పవర్‌‌ఫుల్ ఇంజన్, అద్భుతమైన మైలేజ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్ల కారణంగా సెగ్మెంట్‌లోని ఇతర వాహనాలకు గ్రాండ్ విటారా గట్టి పోటీనిస్తోంది.

- Advertisement -

Also Read : ఓ మాస్టారు ఇది విన్నారా.. ఈ బైక్‌కి క్లచ్ ఉండదంటా!

గ్రాండ్ విటారా లుక్, డిజైన్ అద్భుతంగా ఉంటుంది.  ఓపులెంట్ రెడ్, నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్, ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, స్ప్లెండిట్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ వంటి 9 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఈ కారు అవుట్ లుక్ గురించి చెప్పాలంటే గ్రాండ్ విటారా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్లు, ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్లు, షార్క్-ఫిన్ యాంటీనా, చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్, హై మౌంటెడ్ స్టాప్‌తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటి డిజైన్లు ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా మంచి మైలేజ్‌ని క్లైమ్ చేస్తు్ంది. కంపెనీ ఈ కారును తక్కువ వెయిట్‌ గల హైబ్రిడ్ వేరియంట్‌లలో అందిస్తోంది కాబట్టి దీని మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది. గ్రాండ్ విటారా వివిధ వేరియంట్‌లు 19.38 – 27.97 kmpl మైలేజ్  ఇస్తాయి.

Also Read : వాంటేజ్ నుంచి స్పోర్ట్స్ కార్.. ధర ఎంతో తెలుసా?

గ్రాండ్ విటారా ఆన్-రోడ్ ధర రూ. 12.50 లక్షల నుంmr మొదలై రూ. 23 లక్షల వరకు ఉంటుంది. గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా, జీటా+, ఆల్ఫా+తో సహా ఆరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. గ్రాండ్ విటారాలో 5 మందికి సరిపడా స్పేస్ ఉంటుంది. గ్రాండ్ విటారా కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, MG ఆస్టర్, టాటా హారియర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు పోటీగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News