BigTV English

Case on Manjummel Boys Producer: మరో వివాదంలో మలయాళ హిట్ సినిమా.. చీటింగ్ కేసు నమోదు!

Case on Manjummel Boys Producer: మరో వివాదంలో మలయాళ హిట్ సినిమా.. చీటింగ్ కేసు నమోదు!

Police Case Filed on Manjummel Boys Movie Producers: మలయాళ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. మొన్నటికి మొన్న నిర్మాతలతో థియేటర్ యాజమాన్యానికి ఉన్న విబేధాల వలన సినిమాను నిలిపివేశారు. ఇక ఇప్పుడు ఏకంగా నిర్మాతలపై చీటింగ్ కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని సిరాజ్ వలియాతార పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అసలు ఏంటి ఇదంతా.. అంటే.. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మించారు. సినిమా నిర్మాణంలో భాగంగా సిరాజ్ కు నిర్మాతలు ఒక ఆఫర్ ఇచ్చారు. మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూ. 22 కోట్లతో నిర్మిస్తున్నామని, అందులో తనను రూ7 కోట్లు పెట్టుబడి పెడితే.. సినిమా సక్సెస్ అయ్యాక 40 శాతం లాభాల్లో వాటా ఇస్తామని చెప్పినట్లు సిరాజ్ తెలిపాడు. ఇక వారి మాట నమ్మి.. తాను పెట్టుబడి పెట్టానని, కానీ, ఇప్పుడు లాభాల్లో వాటా ఏమో కానీ కనీసం పెట్టుబడి పెట్టిన రూ. 7 కోట్లు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించాడు.

Also Read: Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్


ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నదని కూడా సిరాజ్ చెప్పుకొచ్చాడు. కోర్టు ఇప్పటికే నిర్మాతల బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. ఇప్పుడు ఎర్నాకుళం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు కేసు పెట్టారు. మరి ఈ చీటింగ్ కేసు నుంచి నిర్మాతలు ఎలా తప్పించుకుంటారో చూడాలి. మంజుమ్మల్ బాయ్స్ ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా ఓటిటీలలో రానుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×