BigTV English
Advertisement

TVS Jive : ఓ మాస్టారు ఇది విన్నారా.. ఈ బైక్‌కి క్లచ్ ఉండదంటా!

TVS Jive : ఓ మాస్టారు ఇది విన్నారా.. ఈ బైక్‌కి క్లచ్ ఉండదంటా!

TVS Jive : బైక్ ఇండస్ట్రీలో టీవీఎస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. టూ వీలర్స్‌లో లెటెస్ట్ టెక్నాలజీని అందిచడంలో టీవీఎస్ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే టీవీఎస్ కొన్నాళ్ల క్రితం క్లచ్‌లెస్ బైక్‌ను లాంచ్ చేసింది. కానీ ఈ బైక్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. దేశంలో క్లచ్ లేని బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి కంపెనీ టీవీఎస్. ఇంతకముందు క్లచ్‌లెస్ టెక్నాలజీ స్కూటర్‌లకు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు టీవీఎస్ ఈ టెక్నాలజీని బైక్‌‌లో డెవలప్ చేసి తీసుకొచ్చింది.


ఈ క్లచ్ లేని  బైక్ అయిన టీవీఎస్ జీవ్  భారతీయ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్, బైక్‌లో క్లచ్‌ని పదేపదే నొక్కడం, గేర్‌లను మార్చడం వంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి కంపెనీ తీసుకొచ్చింది. ఈ బైక్  స్మూత్ రైడ్ అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా దీనివల్ల నగరాల్లో ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. ఇటువంటి బైకుల అవసరం దేశంలో ఎంతైనా ఉందని నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరెన్నో బైకుల్లో ఈ టెక్నాలజీ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్లచ్‌లెస్ బైక్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Also Read : వాంటేజ్ నుంచి స్పోర్ట్స్ కార్.. ధర ఎంతో తెలుసా?


టీవీఎస్ మొదటిసారిగా బైక్‌లో క్లచ్‌లెస్ టిమాటిక్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది 110 సీసీ కెపాసిటీ గల లెటెస్ట్ టెక్నాలజీ గల ఇంజన్. ఈ బైక్‌లో రోటరీ గేర్‌తో పాటు ఆటోక్లచ్ అమర్చారు. నాలుగు గేర్ స్పీడ్ కలిగిన ఈ బైక ఇంజన్ కేవలం 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ బరువు కేవలం 100 కిలోలు మాత్రమే కాబట్టి ట్రాఫిక్‌లో  సులభంగా నడపవచ్చు. ఈ బైక్ లీటర్‌కు 60 నుండి 65 మైలేజీని ఇవ్వగలదు.

Also Read : మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటే.. టాప్ 5 ఇవే

వాస్తవానికి టీవీఎస్ ఈ బైక్‌ను 2009లో విడుదల చేసింది. అంతేకాకుండా సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉన్న మొదటి బైక్ కూడా ఇదు. ఈ స్టోరేజ్ స్పేస్‌లో వాటర్ బాటిల్, గొడుగు వంటి వాటిని ఉంచవచ్చు. గొప్ప ఆకర్షణీయమైన ఫీచర్లతో లోడ్ చేయబడిన జీవ్ మంచి కలర్‌లో కేవలం రూ. 41,000 సరసమైన ధరతో కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×