E-Paper
Advertisement

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!
Advertisement

Home Loan EMI: ఇల్లు కొనుగోలు చేయాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఖర్చుల మధ్య ఈ కలను సాకారం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అందుకే చాలామంది బ్యాంకులను ఆశ్రయించి హోమ్ లోన్ తీసుకుంటుంటారు. లోన్ పొందడం సులభమే అయినప్పటికీ ప్రతి నెలా ఈఎంఐ (EMI) చెల్లించడం మాత్రం కొంత మందికి భారంగా మారుతుంది. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈఎంఐలు కట్టలేకపోతుంటారు. అలాంటప్పుడు బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎన్ని ఈఎంఐలు కట్టకపోతే ఇంటిని వేలం వేసే వరకు పరిస్థితి వెళ్తుంది? వంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఎన్ని ఈఎంఐలు కట్టకపోతే సమస్య వస్తుంది?

ఒకటో రెండో ఈఎంఐలు చెల్లించడం ఆలస్యమైనంత మాత్రాన బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే కఠిన చర్యలు తీసుకోవు. మొదటగా కస్టమర్లకు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తాయి. ఈఎంఐ గడువు ముగిసిందని, త్వరగా చెల్లించాలని గుర్తుచేస్తాయి. అయితే ఈ పరిస్థితి వరుసగా మూడు నెలల పాటు కొనసాగితే మాత్రం మీ లోన్ ఖాతాను బ్యాంకులు ‘ఎన్పీఏ’ (Non-Performing Asset) గా ప్రకటిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంకులు అధికారికంగా చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుడతాయి.

నోటీసుల ద్వారా న్యాయపరమైన చర్యలు

Advertisement

బ్యాంకులు అనుసరించే ఈ చట్టపరమైన ప్రక్రియ అంతా ‘సర్ఫేసీ చట్టం – 2002’ (SARFAESI Act, 2002) నిబంధనల ప్రకారమే జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం.. బకాయిలు చెల్లించాలని కోరుతూ బ్యాంకు మొదటగా రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో నోటీసు జారీ చేస్తుంది. ఈ నోటీసు కాలపరిమితి ముగిసినప్పటికీ బకాయిలు చెల్లించకపోతే, బ్యాంకు సదరు ఆస్తిని తన స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో ఇంటిని సీజ్ చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది. అయితే ఈ చర్యలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకు అధికారులు అప్పటికప్పుడు తీసుకోలేరు. పూర్తిగా చట్టపరమైన నిబంధనలను అనుసరించే ఈ దశకు చేరుకుంటారు.

Also Read: బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

ఆఖరి అస్త్రం.. ఆస్తి వేలం ప్రక్రియ

Advertisement

రుణం తీసుకున్న వారు ఎటువంటి స్పందన తెలియజేయకపోయినా, బ్యాంకును సంప్రదించకపోయినా.. బకాయిలను రాబట్టుకోవడమే లక్ష్యంగా బ్యాంకులు వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ ఈఎంఐ కట్టడం ఆపేసిన 5 నెలలు తర్వాత ఊపందుకుంటుంది. మొదటగా బ్యాంకు ఆ ఆస్తి మార్కెట్ విలువను లెక్కగట్టి, బకాయి మొత్తాన్ని రికవర్ చేయడానికి బహిరంగ వేలం (Public Auction) నిర్వహిస్తుంది. అయితే, ఈ వేలానికి ముందే రుణగ్రహీతకు తన రుణాన్ని చెల్లించి ఇంటిని కాపాడుకునేందుకు మరోసారి చివరి అవకాశం ఇస్తుంది. ఈఎంఐ ఆపేసిన దగ్గ నుంచి ఇల్లు వేలం వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకూ సాధారణంగా 8 నుంచి 12 నెలల సమయం పడుతుందని అంచనా.

Also Read: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

Tags

Related News

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×