E-Paper
Advertisement

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!
Advertisement

Killer Movie:సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేందుకు రెడీ అయిపొయింది.అదే జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కిల్లర్’. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 21న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక అక్టోబర్ 30న సినిమాని వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఒకరకంగా‘కిల్లర్’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ అనౌన్స్ మెంట్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సై-ఫై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసలు కథ ఏంటి? హీరో పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? అనే విషయాలపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ కనిపిస్తుంది.

Advertisement

ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇక ఈ ‘కిల్లర్’ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తుండగా థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకత్వంతో పాటు కథ, ఎడిటింగ్ బాధ్యతలను కూడా పూర్వాజ్ నిర్వహిస్తుండటం ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం.

ఇక ‘కిల్లర్’ను కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని అమెరికా, యూరప్, కెనడా, అరబ్, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాలలో కూడా సినిమాను విడుదల చేయనున్నారు.అంటే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉంటుందన్న మాట.

Advertisement

ఈ మధ్య కాలంలో ‘కల్కి 2898 ఏడీ’ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు ‘గేమ్ ఓవర్’ వంటి థ్రిల్లర్ సినిమాలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ‘కిల్లర్’ కూడా సై-ఫై, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కనిపిస్తుంది.

మొత్తానికి అక్టోబర్ 21న ట్రైలర్, అక్టోబర్ 30న సినిమా విడుదల కానుండటంతో ‘కిల్లర్’ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచిందనే చెప్పాలి. మరి సినిమా విడుదలయ్యాక ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది?. సై-ఫై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘కిల్లర్’ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే !

ALSO READ :‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Tags

Related News

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×