E-Paper
Advertisement

PMEGP Scheme Apply: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్

PMEGP Scheme Apply: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్
Advertisement

PMEGP Scheme Apply: నిరుద్యోగ యువత, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ ప్రారంభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించి, వాటిని విస్తరించేందుకు నిరుద్యోగ యువతకు శిక్షణ, సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై 15-35% వరకు సబ్సిడీ ఇస్తుంది.

పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా రూ.1 ల‌క్ష నుండి రూ.50 ల‌క్షల‌ వ‌ర‌కు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై 15 నుంచి 35 శాతం వ‌ర‌కు రాయితీ ఉంటుంది. మీ వ్యాపారానికి రూ.20 ల‌క్షల లోన్ తీసుకుంటే అందులో రూ.7 ల‌క్షల వరకు సబ్సిడీ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు రూ.50 ల‌క్షల వ‌ర‌కు లోన్ పొందవచ్చు. సేవా రంగానికి చెందిన వ్యాపార యూనిట్లకు రూ.20 ల‌క్షల వ‌ర‌కు లోన్ లభిస్తుంది.

35 శాతం వరకు సబ్సిడీ

Advertisement

ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు లోన్ కు అప్లై చేసుకుంటే.. ముందుగా 5 శాతం పెట్టుబ‌డి పెట్టాలి. జ‌న‌ర‌ల్ కేటగిరికి చెందిన‌ వారైతే 10 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారానికి 35 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ప‌ట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార యూనిట్లకు లోన్ పై 25 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.

పీఎంఈజీపీ స్కీమ్ కు అప్లై చేసుకునే వారు www.kviconline.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేష‌న్ ఫామ్ లో పూర్తి వివరాల‌ను న‌మోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారులు సంప్రదిస్తారు. మీ ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత లోన్ మంజూరు చేస్తారు. రుణం పొందిన తర్వాత మూడేళ్లు క్రమం త‌ప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తేనే సబ్సిడీ వస్తుంది. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు. కనీసం 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్హతతో 18 ఏళ్లు నిండిన‌ వారు మాత్రమే పీఎంఈజీపీ పథకానికి అర్హులు అవుతారు.

పీఎంఈజీపీ అర్హతలు

  • 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
  • తయారీ రంగంలో రూ.10 లక్షల యూనిట్, సేవా రంగంలో రూ. 5 లక్షల కంటే పెద్ద యూనిట్ ఏర్పాటుకు కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • ఇప్పటికే యూనిట్లు (PMRY, REGP, ఇతర పథకాల కింద) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ పొందిన వారు అర్హులు కావు
  • ఇప్పటికే ఉన్న PMEGP / REGP / MUDRA యూనిట్ల అప్‌గ్రేడ్ కోసం రుణాలు పొందవచ్చు.
  • పీఎంఈజీపీ సబ్సిడీ 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ పూర్తైన తర్వాత విడుదల చేస్తారు.
  • PMEGP/REGP/MUDRA కింద మొదటిసారి రుణం తీసుకున్న వారు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించాలి.

ఆన్ లైన్ దరఖాస్తు విధానం

  • పీఎంఈజీపీ వెబ్‌సైట్‌ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp పై క్లిక్ చేయండి.
  • హోం పేజీలో “కొత్త యూనిట్ కోసం దరఖాస్తు” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ లో అన్ని వివరాలు పూర్తి చేసి సేవ్ అప్లికెంట్ డేటా పై క్లిక్ చేయండి.
  • తదుపరి పేజీలో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
Advertisement

Also Read:  ముద్ర లోన్​ పేరుతో మోసాలకు తెరలేపిన గ్యాంగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

పాత యూనిట్ల కోసం దరఖాస్తు

  • పీఎంఈజీపీ వెబ్‌సైట్‌ https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp పై క్లిక్ చేయండి.
  • ఇప్పటికే ఉన్న యూనిట్లు ట్యాబ్ పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, పూర్తి ఫామ్ నింపాలి.
  • తదుపరి పేజీపై క్లిక్ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×