SIP Investment: 40 ఏళ్ల వయసు నిండేకల్లా కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. సరైన సమయంలో పెట్టుబడులు ప్రారంభించి దానిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే.. కోటీశ్వరులు కావడం అసాధ్యమేమి కాదని నిపుణులు చెబుతున్నారు. చిన్న మొత్తంతోనైనా పెద్ద సంపదను ఎలా సృష్టించుకోవచ్చో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఒక వ్యక్తి ప్రతి నెలా రూ. 10,000 చొప్పున క్రమంగా పెట్టుబడి పెడుతూ వస్తే దీర్ఘకాలంలో అది భారీ నిధిగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం ‘చక్రవడ్డీ ప్రభావం’ (Power of Compounding). ఇందులో మన పెట్టుబడిపై వచ్చే లాభాలపై కూడా అదనంగా రాబడులు వస్తాయి. అందుకే ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే చక్రవడ్డీకి అంత ఎక్కువ సమయం లభిస్తుంది. ఉదాహరణకు ఏడాదికి 12 శాతం రాబడినిచ్చే పథకంలో నెలకు రూ. 10,000 చొప్పున పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ. 24 లక్షలు అవుతుంది. అదే 12 శాతం రాబడితో ఈ మొత్తం దాదాపు రూ. 99 లక్షలకు పెరుగుతుంది. అంటే కేవలం రూ. 10,000 SIPతో కోటి రూపాయల నిధిని సమకూర్చుకోవచ్చు.
40 ఏళ్ల వయస్సులోగా కోటి రూపాయల కార్పస్ను నిర్మించాలంటే ముందుగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సులో మొదలుపెడితే 20 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంటుంది. అదే 30 ఏళ్ల వయస్సులో ప్రారంభించేవారైతే ఆలస్యంగా మొదలుపెట్టడం వల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే మొత్తంతో పాటు ఏ వయస్సులో మొదలుపెడుతున్నారనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Also Read: అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!
కోటీశ్వరులు కావడానికి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో మెుదటిది త్వరగా పెట్టుబడి ప్రారంభించడం కాగా, రెండోది క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, జీతం పెరిగినప్పుడల్లా ఇన్వెస్ట్ ను పెంచుకుంటూ వెళ్లడం. ఉదాహరణకు స్థిరంగా పెట్టే రూ.10,000 ఎస్ఐపీతో పోలిస్తే.. వార్షిక ఎస్ఐపీ విరాళాన్ని ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతే దీర్ఘకాలంలో మరింత పెద్ద నిధిని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఆరంభంలో రూ. 10,000 చిన్న మొత్తంగా అనిపించినా, భవిష్యత్తులో పెట్టుబడిని పెంచుకుంటూ చక్రవడ్డీ జత చేసుకుంటే త్వరగా కోటీశ్వరులు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!