E-Paper
Advertisement

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం
Advertisement

Gold Price Today: వడ్డీ రేటు పెరగవచ్చన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఫలితంగా బంగారం ధర రోజు రోజుకూ కిందకు దిగొస్తోంది. ఆ మార్కెట్ల ప్రభావం భారత్‌పై పడింది. ఒక విధంగా చెప్పాలంటే పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయంగా గడిచిన రోజుల్లో తులం బంగారం రూ.4300 మేరా దిగిచ్చింది. ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా దాడులు చేయడం, ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. డాలర్ ప్రభావం వంటివి బంగారం ధరలపై చూపించాయి.

పతనమవుతున్న బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల మేరకు.. సెప్టెంబర్ ఒకటి ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,56,760 వద్ద వుంది. కిందటి ధరతో పోల్చితే 10 గ్రాములకు రూ.1470 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ. 1,43,690గా ఉంది. ఇది కూడా రూ.1350 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,59,900 వద్ద ఉంది.

Advertisement

 

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఢిల్లీలో 25 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 1,56,910 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ. 1,43,840 ఉంది. ఇక ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ మార్కెట్లో ధరలు 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 1,56,760 ఉంది. దీనికి 100, లేదా 200 అటు ఇటుగా మిగతా మార్కెట్లో ఉంది. 22 క్యారెట్ల ధర రూ. 1,43,690 కొనసాగుతోంది. మార్కెట్ మొదలైన తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించనున్నాయి.

Advertisement

ALSO READ: కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×