BigTV English

UPI New Rules: యూపీఐ కొత్త రూల్స్.. నేటి నుంచి 10 లక్షల వరకు, ఇంకెందుకు ఆలస్యం

UPI New Rules: యూపీఐ  కొత్త రూల్స్.. నేటి నుంచి 10 లక్షల వరకు, ఇంకెందుకు ఆలస్యం

UPI New Rules: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI వినియోగదారులకు శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15 లావాదేవీల పరిమితిని పెంచింది. గతంలో రూ. 5 లక్షలుగా ఉండే పరిమితిని ఇప్పుడు అమాంతంగా రెట్టింపు చేసింది. అదేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


చిన్న వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు ఉపయోగపడేలా యూపీఐ కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కీలక రంగాలలో పెద్ద చెల్లింపులను సులభంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) చెల్లింపులకు రోజువారీ పరిమితి లక్ష వరకు ఉంటుంది. ఇందులో ఏ మాత్రం పెంపు లేదు.

కొత్త రూల్స్ ప్రకారం.. ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి, బీమా ప్రీమియం, EMI, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు వటి లావాదేవీలకు వర్తిస్తుందని NPCI స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రజలు ఈ చెల్లింపులను ఒకేసారి సులభంగా చేసుకోవచ్చు. గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియమ్, ఈఎంఐలు చెల్లించాలంటే రెండు, మూడు సార్లు ట్రాన్సాక్షన్ చేసేవారు. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు.


కొత్త రూల్స్ ప్రకారం ఒక్క ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయవచ్చు. ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ వంటివి ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ-మార్కెట్ ప్లేస్‌లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చెల్లించుకోవచ్చు.

ALSO READ: రూ. 149 రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్.. జియో కొత్త ఆఫర్ల వివరాలు

క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడంలో టెన్షన్ అవసరం లేదు. ఓకేసారి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు క్రెడిట్ కార్డు బిల్లులు క్లియర్ చేయవచ్చు. ఆభరణాలు కోసం అయితే రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు చెల్లించుకోవచ్చు.

బిజినెస్ లేదా మర్చంట్ పేమెంట్స్‌కి రూ.5 లక్షల వరకు ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. ఎఫ్ ఎక్స్ రిటైల్ కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే. డిజిటల్ అకౌంట్ ఓపెన్‌కు 5 లక్షల వరకు ఉంటుంది. డిజిటల్ అకౌంట్ ఓపెన్-ఇనీషియల్ ఫండింగ్ రోజుకు రెండు లక్షల వరకు మాత్రమే ఉండనుంది.

డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పెద్ద చెల్లింపులను చేయడానికి వినియోగదారులు పలుమార్లు లావాదేవీలు చేసేవారు. ఇప్పుడు ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. దీంతో లావాదేవీ ప్రక్రియ వేగవంతం కానుంది. డిజిటల్ ఇండియాను మరింత బలోపేతం చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Related News

Flight Tickets Offers: తక్కువ ధరకే విమాన టికెట్.. ఇండిగో రన్‌వే ప్రత్యేక ఆఫర్ వివరాలు

Motorola Smartphone: మోటరోలా బెస్ట్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌

Jio Offers: రూ.149 రీచార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్.. జియో కొత్త ఆఫర్ వివరాలు

Amazon offers: గేమ్ ఆడండి ఐఫోన్ గెలుచుకోండి.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ బంపర్ ఆఫర్

GST Reduction: షాపులకు కొత్త రూల్స్.. ఇకపై కొత్త బోర్డులు పెట్టాల్సిందే, మేటరేంటి?

PLI Scheme: PLI స్కీమ్ లో కొత్త విండో పీరియడ్.. ఏసీలు ఎల్ఈడీ లైట్ల తయారీ పరిశ్రమలకు మరో ఛాన్స్

September 22 GST: సెప్టెంబర్ 22 తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయా? నిజం ఏమిటి?

Big Stories

×