Jio Offers: జియో కంపెనీ ప్రతి నెలా వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు తీసుకొస్తూ ఉంటుంది. సెప్టెంబర్ 2025లో కూడా జియో కొన్నిప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇవి ప్రీపెయిడ్ రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు చేసే వారికి, కొత్త యూజర్లకు మరియు పాత వినియోగదారులందరికీ అందుబాటులో ఉన్నాయి.
క్రెడ్ పే తో రీచార్జ్ చేస్తే ఆఫర్ వస్తుందా!
మొదటగా క్రెడ్ పే ద్వారా జియో క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి చెప్పుకోవాలి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంది. మీరు క్రెడ్ పే ద్వారా యూపీఐ ఆటోపే సెట్‌అప్ చేసి లేదా బిల్ చెల్లించినా, రీచార్జ్ చేసినా, గరిష్టంగా రూ.250 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. దీని కోసం కనీసం రూ.149 రీచార్జ్ చేయాలి. అంటే చిన్న రీచార్జ్ ప్లాన్‌లు కూడా ఈ ఆఫర్‌లోకి వస్తాయి. ఈ ఆఫర్ ప్రత్యేకంగా క్రెడ్ పే యూజర్ల కోసం రూపొందించబడింది. సాధారణంగా జియో రీచార్జ్ చేసే వారు క్రెడ్ యాప్ ద్వారా చేస్తే అదనంగా క్యాష్ బ్యాక్ లాభం పొందుతారు.
ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్
తర్వాత మరో ముఖ్యమైన ఆఫర్ యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ క్యాష్‌బ్యాక్‌లు / రివార్డులు. ఫోన్‌పే యాప్ ద్వారా జియో రీచార్జ్ చేసేవారికి కూడా మంచి రివార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త యూజర్లు మొదటి మూడు రీచార్జ్‌లు చేసేటప్పుడు, ఒక్కో రీచార్జ్ కనీసం రూ.200 లేదా అంతకంటే ఎక్కువ చేస్తే, బ్రాండ్ ఈ-వాచర్స్ రూపంలో గరిష్టంగా రూ.400 వరకు రివార్డ్స్ పొందవచ్చు. అంటే మీరు ఫోన్‌పేలో మొదటి మూడు రీచార్జ్‌లు చేస్తే ఒక్కొక్క రీచార్జ్‌కి కనీసం ఒక వౌచర్ వస్తుంది. ఆ వౌచర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బజార్ లాంటి ప్రముఖ బ్రాండ్లలో ఉపయోగించుకోవచ్చు.
Also Read: Navagraha Puja: నవగ్రహాలను ఎందుకు పూజించాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి
కొత్త వారికేనా? పాత వినియోగదారులకు లేదా?
ఇక పాత వినియోగదారులకు కూడా ఈ ఫోన్ పే ఆఫర్ వర్తిస్తుంది. కానీ కొత్త యూజర్లకు లభించే రూ.400 వరకు రివార్డు పాత వినియోగదారులకు అంతగా రాకపోవచ్చు. అయినా సరే, కనీసం చిన్న మొత్తంలోనైనా రివార్డ్స్ లభిస్తాయి. ఈ విధంగా జియో రీచార్జ్ చేసేటప్పుడు మీరు ఫోన్‌పే లేదా ఇతర భాగస్వామి యాప్‌ల ద్వారా చేస్తే అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది.
కస్టమర్లకు ఆకర్షించేందుకు
ఈ ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారని అంటే, జియో లక్ష్యం కొత్త కస్టమర్లను ఆకర్షించటం, ఉన్న కస్టమర్లు ఎక్కువగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడం అలవాటు చేసుకోవడం. అందుకే యూపీఐ ఆటోపే లాంటి ఫీచర్లు వాడమని ప్రోత్సహిస్తూ క్యాష్‌బ్యాక్‌లు ఇస్తున్నారు. అలాగే ఫోన్‌పే లాంటి యాప్‌లతో కలిసి పనిచేయడం ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ల సంఖ్య పెంచడం జరుగుతోంది.
ఎప్పటి వరకు ప్లాన్ ఉంటుంది?
ఇక జియో రీచార్జ్ ప్లాన్‌ల విషయానికి వస్తే, ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్‌లు సాధారణంగా డేటా, వాయిస్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్‌తో పాటు, కొన్ని ప్లాన్‌లలో ఓటీటీ యాక్సెస్ కూడా ఇస్తున్నాయి. మీరు ఒకవేళ నెలసరి రీచార్జ్ చేస్తున్నా, లేక 3 నెలల ప్లాన్ చేస్తున్నా, ఈ ఆఫర్లు మీదే వర్తిస్తాయి. ముఖ్యంగా రూ.149 నుండి పైగా ఉన్న ప్రతి రీచార్జ్‌పై క్యాష్‌బ్యాక్ లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త ఆఫర్లు వస్తాయి కానీ ప్రస్తుత క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ముగిసిపోతాయి. కాబట్టి ఈ నెలలో ఎవరికైనా రీచార్జ్ చేయాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్లను ఉపయోగించుకోవడం మంచిది.