BigTV English

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలని ఎంతోమంది కలలు కంటారు. ఆ కలలను సహకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు కూడా.. మరి కొంతమంది ఈ హౌస్ లోకి మేము వెళ్ళము అని ప్రగల్బాలు పలికి.. ఆ తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీస్ కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. దాంతో ఆయనను ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేస్తూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లవచ్చు కదా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 సమయంలో సలహాలు ఇచ్చారు.


బిగ్ బాస్ పై ఊహించని కామెంట్స్..

దాంతో ఆయన ఏడూర్లు వెళ్లి అడుక్కు తింటాను కానీ ఆ కొంపలోకి మాత్రం వెళ్ళను అంటూ ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడేమో అగ్నిపరీక్షలో తన బలాబలాలను నిరూపించుకోకుండా తనను బయటకు నెట్టేసారని.. ఇప్పుడు హౌస్ లోకి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ కామెంట్లు చేస్తున్నారు.. దీంతో అప్పుడేమో అలా చెప్పాడు.. ఇప్పుడేమో ఇలా అంటున్నాడు ఏంటి సంగతి అంటూ అతడిపై ఊహించని కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అతను ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి తాపత్రయం..


ఆయన ఎవరో కాదు ANN నర్సయ్య.. జర్నలిస్టుగా, ఫోక్ సింగర్ గా కెమెరాను ఫేస్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఈసారి కామన్ మ్యాన్ క్యాటగిరీలో బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగు పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోయే కామనర్స్ కోసం అగ్నిపరీక్ష అంటూ ఒక షో నిర్వహించగా.. అందులో పాల్గొని మొదటి రోజే బయటకి వచ్చేసారు.. అప్పుడు ఈ షో జడ్జ్ నవదీప్ (Navadeep) పై ఆయన విమర్శలు గుప్పిస్తూ హౌస్ లోకి తనని ఎందుకు తీసుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఒక్క అవకాశం ఇవ్వాల్సింది అంటూ కామెంట్లు చేశారు. కానీ గత రెండు సంవత్సరాల క్రితం ఈ బిగ్ బాస్ పై ఆయన చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:Upendra: కన్నడ స్టార్ హీరో ఫోన్ హ్యాక్.. దయచేసి మోసపోకండి అంటూ!

అడుక్కుతింటా కానీ హౌస్ లోకి వెళ్ళను..

అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్ళమని అడగగా.. దానిపై ANN నర్సయ్య మాట్లాడుతూ..” ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటాను కానీ నాకు ఈ బిగ్ బాస్ వద్దు చిన్న బాస్ వద్దు.. ఆ కొంపలోకి మాత్రం వెళ్ళను.. 101 రోజు పెళ్ళాం, పిల్లల్ని చూడకుండా.. కనీసం ఫోన్ కూడా ఇవ్వకుండా నరకం చూపిస్తారు. ఉన్న పరువు కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే పోతుంది. ఖతర్నాక్ కాకా గా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ పరువు కూడా పోతుంది”. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడేమో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనివ్వడం లేదు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు దీంతో నర్సయ్య పై నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్.. హౌస్‌లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను

Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Bigg Boss 9 : ఇట్స్ అఫీషియల్, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎలిమినేటెడ్, ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Bigg Boss 9: సందడి చేసిన మిరాయ్ టీం.. ఇమ్మానుయేల్ దెబ్బకు తేజ ఏం చేశారంటే?

Bigg Boss 9: కామనర్స్ కి ఇచ్చి పడేసిన నాగ్.. ఇంత పార్శియాలిటీనా?

Big Stories

×