శ్రియా శరణ్. తెలుగు సినిమా అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు తెరపై కనువిందు చేస్తోంది. 2001లో ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆమె, తెలుగులోని స్టార్ హీరోలు అందరినీతోనూ జతకట్టింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళ్, కన్నడ సహా పలు భాషల్లోనూ నటించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా చెక్కు చెదరని అందం, అభినయంతో సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళ్తుంది. తాజాగా ఆమె ‘మిరాయ్’ సినిమాలో హీరో తేజ సజ్జ తల్లి పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది శ్రియా.
తన భర్త ఆండ్రీ కొశ్చీవ్ తో పరిచయం చాలా ఆసక్తికరంగా ఏర్పడిందని చెప్పింది శ్రియా. “మా ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లాలి అనుకున్నాం. అయితే, నేను పొరపాటుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఒంటరిగా మాల్దీవ్స్ కు వెళ్లాను. అక్కడ నేను ఆండ్రీని కలిశాను. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తర్వాత ప్రేమగా మారింది. అయితే, మొదట్లోనే నేను హీరోయిన్ అనే విషయం అతడికి తెలియదు. ఓ రోజు నేను నటించిన ‘దృశ్యం’ సినిమా చూశాడు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చూసి భయపడ్డాడు. ఆ తర్వాత మా ప్రేమ మరింత బలంగా మారింది. 2018లో పెళ్లి చేసుకున్నాం. 2021లో మాకు ఓ పాప పుట్టింది. ఆమెకు రాధ అని పేరు పెట్టాం” అని శ్రియా తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
శ్రియా శరణ్ ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘మిరాయ్’ ప్రస్తుతం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసుంతుంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో శ్రియా అంబిక అనే పవర్ ఫుల్ పాత్రను పోషించింది. మనిషిన భగవంతుడిగా మార్చే నవగ్రంథాల్లో ఒకటైన తొమ్మిదో గ్రంథాన్ని కాపాడే బాధ్యతను ఆమె తీసుకుంటుంది. దానిని దుష్టుల చేతిలో పడకుండా కాపాడేందుకు తన ప్రాణాన్ని బలి ఇవ్వడంతో పాటు తన కొడుకును దానికి రక్షణ బాధ్యతలను అప్పగిస్తుంది. కనిపించింది మరీ ఎక్కువ కాకపోయినా సినిమాపై మంచి ముద్రను వేసింది. ఆమెన నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
Read Also: ప్రెగ్నెన్సీ టెస్టులో మగాడికి పాజిటివ్.. ఇలా కూడా వస్తుందా?