Amazon offers: ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దసరా, దీపావళి సందర్భంగా ఆఫర్ల రావడంతో, కొందరు ఈఎంఐ ప్రాసెస్‌లో తీసుకుంటే, మరికొందరు మధ్య తరగతి వారు మాత్రం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఐఫోన్ మనకు ఫ్రీగా వస్తే ఎలావుంటుంది? ఏం మాట్లాడుతున్నావ్ గురూ? ఇది అసలు జరిగే పనేనా అంటారా? అవును, జరుగుతుంది. మీలాంటి వారి కోసమే అమెజాన్ ఒక మంచి అవకాశం మీ ముందుకు తీసుకువచ్చింది. అమెజాన్ ఇండియా మొబైల్స్ పేజీలో స్పెషల్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. “ఐఫోన్ 15 ప్రైస్ దెఖా క్యా?” అనే పేరుతో ఈ కాంటెస్ట్ పెట్టింది. ఇందులో పాల్గొని అదృష్టవంతుడిగా నిలిస్తే, ఐఫోన్ 15ని గిఫ్ట్‌గా పొందొచ్చు. మరి ఇందులో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి, అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది ఎలా ఆడాలి?
* మొదటగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఒక ట్రెజర్ హంట్ తరహా కాంటెస్ట్. అంటే చిన్న చిన్న క్లూలు, స్టిక్కర్లు వెతకాల్సి ఉంటుంది. మీరు ఐఫోన్ 15 మీద ఆసక్తి కలిగిన వారైతే తప్పక ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది.
* మొదటి దశలో మీరు చేయాల్సింది అమెజాన్ మొబైల్స్ పేజీలోకి వెళ్లడం. అక్కడ ఐదు స్టిక్కర్లు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా ప్రతి రోజూ అన్‌లాక్ చేయాలి. ఒక్కో రోజు ఒక స్టిక్కర్ మాత్రమే దొరుకుతుంది. దొరికిన వెంటనే ఆ స్టిక్కర్‌కి స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. ఇది స్టెప్ వన్.
* తర్వాతి స్టెప్ చాలా ముఖ్యమైంది. మీరు తీసుకున్న ఆ స్క్రీన్‌షాట్‌ను మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలి. కేవలం పోస్ట్ చేయడమే కాదండోయ్.. మీరు ఐఫోన్ 15 ధర ఎంత ఉండబోతోంది అనే అంచనా వేసి అందులో రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత తప్పనిసరిగా @అమెజాన్ మొబైల్స్ఇన్ ను ట్యాగ్ చేయాలి. అదనంగా #ఐఫోన్ 15 ప్రైస్ దేఖా క్యా, #అమెజాన్ గ్రేట్ ఇండియన్ సెల్ అనే హాష్‌ట్యాగ్‌లను కూడా వాడాల్సి ఉంటుంది. ఇవి వాడకపోతే మీ ఎంట్రీ లెక్కలోకి రాదు.
* మూడో స్టెప్‌లో మీరు ఐఫోన 15ని అమెజాన్‌లో విష్‌లిస్ట్ చేసుకోవాలి. అలాగే @అమెజాన్ మొబైల్స్ఇన్ అకౌంట్‌ను ఫాలో చేయాలి. ఇదంత చేసిన తర్వాతే మీ ఎంట్రీ కౌంట్ అవుతుంది.
Also Read:Nani: ఆశకు పోయి మిరాయ్ ఛాన్స్ మిస్ చేసుకున్న నాని.. ఎంత పని చేశావ్ భయ్యా!
ఈ గేమ్ ఆడాలి అంటే షరతులు ఉన్నాయండోయ్!
ఈ కాంటెస్ట్‌లో కేవలం భారతీయులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ సంస్థ. అది కూడా 18 ఏళ్లు పైబడిన వారు. ఒక్కరు ఒకేసారి ఒక్క ఐఫోన్ మాత్రమే గెలుచుకోవచ్చు. అంటే మీరు వందసార్లు ఆడినా, గెలిస్తే ఒకటి మాత్రమే వస్తుందని గుర్తించుకోండి. ఎన్ని సార్లు గెలిస్తే అన్ని ఐఫోన్స్ వస్తాయి అనుకోవడం మీ భ్రమే అవుతుంది.
విన్నర్ ఎంపిక ఎలా జరుగుతుంది?
విన్నర్ ఎంపిక పూర్తిగా రాండమ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు అదృష్టవంతుడిగా నిలుస్తారో వారిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ మెసేజ్ ద్వారా గెలిచారని సమాచారం ఇస్తారు. అమెజాన్ చెప్పేదే తుది నిర్ణయం అని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఫ్రాడ్స్ ఉండదు. తప్పుడు మెసేజస్ వస్తే వాటితో సంబంధం ఉండదు. అలాగే అమెజాన్ ఎప్పుడైనా ఈ కాంటెస్ట్‌ను మార్చే లేదా రద్దు చేసే హక్కు కూడా కలిగి ఉంది.
ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?
ఈ కాంటెస్ట్ 2025 సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని గుర్తించుకోండి. ఆ గడువు దాటితే, మీకు ఎలాంటి అవకాశం ఉండదు. మరి, ఇంత సులభమైన గేమ్‌లో మీరు కూడా పాల్గొని అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటే మరెందుకు ఆలస్యం ఈ సులభమైన పనులు చేస్తే, ఖరీదైన ఐఫోన్ 15 మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడే మీ ట్రెజర్ హంట్ మొదలు పెట్టండి. ఎవరికీ తెలుసు.. రేపటికి మీరు అమెజాన్ కాంటెస్ట్ విజేతగా ఐఫోన్ 15ని మీ చేతుల్లో పట్టుకుని ఉండవచ్చు!