BigTV English

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

Prasar Bharati: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. న్యూఢిల్లీలో ప్రసార భారతి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎంఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


న్యూఢిల్లీలోని ప్రసార్ భారతి (భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలానికి ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌లో వివిధ విభాగాల్లో కంటెంట్‌ మేనేజర్‌, క్రియేటివ్‌ డిజైనర్‌, గ్రాఫిక్‌ ఎడిటర్‌, మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 50


ప్రసార భారతిలో కంటెంట్‌ మేనేజర్‌, క్రియేటివ్‌ డిజైనర్‌, గ్రాఫిక్‌ ఎడిటర్‌, మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు

 కంటెంట్ మేనేజర్ (సోర్సింగ్)- 01
కంటెంట్ మేనేజర్ (ఆపరేషన్స్)- 02
 కంటెంట్ మేనేజర్ (ప్రొడక్షన్)- 02
క్రియేటివ్ డిజైనర్- 01
 గ్రాఫిక్ ఎడిటర్- 04
 వీడియో ఎడిటర్- 04
 కంటెంట్ ఎగ్జిక్యూటివ- 25
 లైబ్రరీ అసిస్టెంట్- 02
 ఐటి ఎగ్జిక్యూటివ్- 03
 జూనియర్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్)- 01
 మేనేజర్ (మార్కెటింగ్ & సేల్స్)- 01
జూనియర్ మేనేజర్ (మార్కెటింగ్ & సేల్స్)- 02
 ఫైనాన్స్ ప్లానర్ (అకౌంట్స్- సీఏ/సీఎంఏ)- 01
ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ & అకౌంట్స్)- 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ/సీఎంఏ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టంబర్ 10

దరఖాస్తుకు చివరి తేది: నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లోగా అప్లై చేసుకోవాలి (అంటే సెప్టెంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలి)

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. ఐటి ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించి ఉండరాదు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. మంచి జీతం ఉంటుంది. నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఈ- మెయిల్ వస్తుంది..

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

ALSO READ: Weather News: మళ్లీ కుండపోత వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Related News

DSSSB: ఇంటర్ అర్హతతో భారీగా జాబ్స్.. తక్కువ పోటీ.. వెంటనే అప్లై చేయండి బ్రో

ESIC Jobs: ఈఎస్ఐసీలో 243 ఉద్యోగాలు.. రూ.2,08,700 జీతం, దరఖాస్తుకు ఇంకా 2 రోజులే సమయం

DDA Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. డీడీఏలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలివే

Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

Airport Authority of India: ఇది అద్భుమైన అవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు బ్రో

State Bank of India: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హత ఉంటే చాలు

Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్

Big Stories

×