Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య విస్తరించింది. ఏపీ, తెలంగాణల్లో జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా. ఆగస్టు నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ పట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన మేరకు రాష్ట్రానికి మరోసారి వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది..
నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ తెలంగాణ జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రంతా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్ లో పలు చోట్ల రాత్రి సమయాల్లో వర్షం పడుతోందని చెప్పారు.
ALSO READ: Aarogyasri Services: రాష్ట్ర ప్రజలకు బిగ్ బ్యాడ్ న్యూస్.. మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
మరో రెండు గంటల్లో పలు జిల్లాలో మోస్తరు పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: Mahabubabad News: ఇన్ స్టా లవ్.. అర్ధరాత్రి ఏకంగా భర్తను చంపబోయింది.. చివరకు?
పిడుగులు పడే ఛాన్స్..
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. భాగ్య నగరంలో సాయంత్రం వేళ మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.