E-Paper
Advertisement

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు
Advertisement

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో భారతీయులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేయడం, హిందువులను దాడి చేసి చంపేయడంపై నిరసనలు ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీలో బంగ్లాదేశ్‌ హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు.

బంగ్లాదేశ్‌లో వరుస ఘటనలు

Advertisement

గతవారం బంగ్లాదేశ్‌లో స్టూడెంట్ నాయకుడు హైది మృతి నేపథ్యంలో ముస్లింలకు చెందిన అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు అర్థరాత్రి జరిగిన నిరసనల్లో 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను  అల్లరి మూకల గుంపు కొట్టి చంపేసింది. అతడి మృతదేహాన్ని చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఆ తర్వాత మరొక వ్యక్తిపై దాడి చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  దీపు చరణ్ సింగ్‌ను తోటి కార్మికులే పోలీసులకు అప్పగించడం విస్మయానికి గురిచేస్తుంది. డిసెంబర్ 19న జరిగిన ఘటన టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.

Advertisement

ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను యావత్త్ ప్రపంచం ఖండించింది. ఆదేశంలో జరుగుతున్న వరుస ఘటనలతో అక్కడి హిందువులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో దీపు చంద్ర దాస్‌ హత్య నేపథ్యంలో న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడికి హిందూ సంఘాలు ప్రయత్నించాయి.

ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ ఆఫీసు ముట్టడికి హిందూ సంఘాల యత్నం

హిందువులపై జరిగిన దారుణాలు, మతపరమైన ప్రదేశాల ధ్వంసాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్-VHP, బజరంగ్ దళ్ నిరసనకు పిలుపు నిచ్చాయి. బారీకేడ్లను నెట్టుకొని లోపల వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. మూడు అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరినీ లోపలికి వెళ్లకుండా పారా మిలటరీ బలగాలను రంగంలోకి దిగాయి. ఎంబసీ ముందు  ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీపు దాస్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ALSO READ: భారత్ లో హెచ్ 1 బీ వీసాదారులకు పునరుద్ధరణ కష్టాలు

బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మలను నిరసనకారులు తగులబెట్టారు. నిరసనకారులు భారత్ మాతా కీ జై, యూనుస్ సర్కార్ హోష్ మే ఆవో అంటూ నినాదాలు చేశారు. అక్కడ పరిస్థితిని గమనించిన పోలీసులు, లాఠీఛార్జ్ చేశారు.  ఆందోళనకారులను ఆ ప్రాంతం నుండి తరలించడానికి అదుపులోకి తీసుకుంటున్నారు.  బంగ్లాదేశ్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టాలని  విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 

మరోవైపు ఢాకాలో హింసాత్మక నిరసనలు ‘మోబోక్రసీ (మూక వ్యవస్థలు) నిదర్శనమని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఆమిర్ ఖస్రు మహమ్మద్ మండిపడ్డారు. మోబోక్రసీని నియంత్రించడంలో తాత్కాలిక సారథి యూనస్ విఫలమయ్యారని విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొన్నివర్గాలు హింసను ప్రేరేపిస్తున్నట్లు అక్కడి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.

 

Related News

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×