E-Paper
Advertisement

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!
Advertisement

Nagpur Murder Case: మహారాష్ట్ర నాగపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందనే కోపంతో 38 ఏళ్ల వివాహితను ఆమె ప్రియుడు అతి క్రూరంగా హత్య చేశాడు. తలపై బరువైన వస్తువుతో కొట్టి.. రూమ్ హీటర్‌తో ఆమె శరీరంపై కాలిన గాయాలు చేసి పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసుల కథనం ప్రకారం మృతురాలికి భర్తతో పాటు 11, 13 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిందితుడిని జల్గావ్ జిల్లా రావర్‌ తహశీల్‌కు చెందిన జావేద్ షేక్ షాహిద్ మన్యార్ (33)గా గుర్తించారు. నిందితుడు నాగపూర్‌లో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలితో అతనికి దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. కొద్దికాలంగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. జావేద్‌కు ఇదివరకే పెళ్లి కావడంతో, తనను కూడా వివాహం చేసుకోవాలని సదరు మహిళ కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం మెుదలయ్యాయి.

తలపై మోదీ.. హీటర్‌తో కాల్చి..

Advertisement

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మహిళ భర్త స్వగ్రామానికి వెళ్లగా, ఆమె ఇద్దరు కుమార్తెలు తమ బాబాయ్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జావేద్ ఆ మహిళ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి పెళ్లి విషయమై ఇద్దరి మధ్య మరోమారు తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జావేద్.. బరువైన వస్తువుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంలో భాగంగా రూమ్ హీటర్‌ను ఉపయోగించి ఆమె శరీరంపై తీవ్రమైన కాలిన గాయాలు చేశాడు. ఆ వెంటనే రాత్రికి రాత్రే రైలులో జల్గావ్‌కు పరారయ్యాడు.

Also Read: అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

రంగంలోకి పోలీసులు.. నిందితుడు అరెస్ట్

Advertisement

సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన కుమార్తెలకు తల్లి విగతజీవిగా కనిపించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. మొదట ఆమె విద్యుత్ షాక్ కారణంగానే మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే తలకు తీవ్ర గాయం కావడం వల్లే ఆమె మరణించినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మెుబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు జావేద్‌ను మంగళవారం జల్గావ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అతడిని నాగపూర్‌కు తరలించి కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ 17 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ విధించారు.

Also Read: వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

Tags

Related News

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

Big Stories

Advertisement
×