E-Paper
Advertisement

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో
Advertisement

Malayalam Comedy Series OTT : కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి ఏదో ఒకటి సాధించాలని చాలామంది కలలు కంటారు. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని, అందరికీ తామేంటో చూపించాలని అనుకుంటారు. కానీ కలలు కనడం సులువు, వాటిని నిజం చేయడం మాత్రం అంత ఈజీ కాదు. ముఖ్యంగా స్నేహితులందరికీ వేర్వేరు అభిప్రాయాలు, ఆశలు, అహాలు ఉంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద గొడవగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులను వినోదం, భావోద్వేగాలతో చూపించే వెబ్‌ సిరీస్‌ ‘కప్పి స్క్వాడ్‌’ (Kappi Squad). ఈ మలయాళం కామెడీ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్‌ కథ నలుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. వాళ్లందరికీ జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉంది. అయితే వారి వ్యక్తిగత అసంతృప్తులు, ఆత్మవిశ్వాస లోపాలు, అహం, ఇతరుల నుంచి గుర్తింపు పొందాలనే తపన వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి. ఈ నలుగురూ కలిసి ఓ కేఫ్‌ ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో కథకు మంచి ఊపు వస్తుంది. వ్యాపారం మొదలు పెట్టడం వెనుక వాళ్ళకు ఉండే ఆశయం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. తాము కూడా ఏదో చేయగలమని ఇతరులకు నిరూపించుకోవాలనే కోరిక కూడా ఉంటుంది.

Advertisement

కేఫ్‌ ప్రారంభమైన తర్వాత పరీక్ష మొదలవుతుంది. ఒకరి ఆలోచన మరొకరికి నచ్చకపోవచ్చు. ఎవరి మాటకు విలువ ఇవ్వాలి, నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి, కష్టపడుతున్నది ఎవరు, పేరు సంపాదిస్తున్నది ఎవరు అనే విషయాలు స్నేహంలోనే చిన్న చిన్న చిచ్చులు పెట్టగలవు. వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలంటే పరస్పర నమ్మకం అవసరం. కానీ గర్వం ఎక్కువైతే అదే ఫ్రెండ్షిప్ లో డేంజర్ గా మారే ప్రమాదం ఉంటుంది. ఈ యువకులు తమ మధ్య ఉన్న విభేదాలను ఎలా ఎదుర్కొంటారు ? తమ కలను నిలబెట్టుకోవడానికి, మారడానికి ఎంత వరకు సిద్ధపడతారు ? అన్నది సిరీస్‌ లో చూడాల్సిన కథ.

Also Read : కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

మలయాళం సిరీస్ తెలుగులో

Advertisement

‘కప్పి స్క్వాడ్‌’ అక్టోబర్‌ 15 నుంచి జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ కు వచ్చింది. ఈ సిరీస్‌ ను తెలుగు సహా పలు భాషల్లో డబ్‌ చేసి విడుదల చేశారు. స్నేహితులతో కలిసి చూడదగిన సరదా కథలు, యువత జీవితంలోని ఒత్తిళ్లు, కలలు, అహాల మధ్య జరిగే సంఘర్షణలు ఇష్టపడేవారికి ‘కప్పి స్క్వాడ్‌’ మంచి ఆప్షన్. ఇందులో రినోష్‌ జార్జ్‌ (Rinosh George), జోయెల్‌ జోసెఫ్‌ (Joel Joseph), అనఘా అజిత్‌ (Anagha Ajith), దియా దీపన్‌ (Diya Deepan), అభిరామి దయానందన్‌ (Abhirami Dayanandan) తదితరులు ఇందులో నటించారు. శ్రీకాంత్‌ మోహన్‌ (Sreekanth Mohan) ఈ సిరీస్‌ను రూపొందించగా, బెల్‌రాజ్‌ కలరిక్కల్‌ (Belraj Kalarickal) దర్శకత్వం వహించారు.

Related News

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా

బంగారు లాకెట్‌తో మొదలైన చిక్కులు… కోర్టును షేక్ చేసే మత్స్యకారుడి పోరాటం… ఓటీటీలో తెలుగులో ఎమోషనల్ డ్రామా

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

Big Stories

Advertisement
×