BigTV English

Cheapest Cars With 360 Camera: 360 డిగ్రీ కెమెరా అందించే బడ్జెట్ కార్లు ఇవే!

Cheapest Cars With 360 Camera: 360 డిగ్రీ కెమెరా అందించే బడ్జెట్ కార్లు ఇవే!

Cheapest Cars With 360 Camera: ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది. కస్టమర్లు కూడా హైటెక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. లెటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఫీచర్లను కోరుకుంటున్నారు. అందులో ఒకటి 360 కెమెరా. దీంతో కారు సరౌండింగ్ మొత్తం చూడొచ్చు. ఈ కెమెరా డ్రైవర్లు ఇరుకైన ప్రదేశాలలో, ట్రాఫిక్, పార్కింగ్ చేస్తున్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ద్వారా డ్రైవర్ వారి వాహనం చుట్టూ ఏమి ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో వస్తున్న బడ్జెట్ కార్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్  టాప్-ఎండ్ XV ప్రీమియం వేరియంట్ 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది. దీని ధర రూ. 8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్‌తో వస్తున్న భారతదేశంలో అత్యంత చౌకైన కారు మాగ్నైట్.

Also Read: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!


Maruti Baleno
మారుతి సుజుకి బాలెనో టాప్-ఎండ్ ఆల్ఫా ట్రిమ్‌లో 360-డిగ్రీ కెమెరాను అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.9.33 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Toyota Glanza
టయోటా గ్లాంజా కూడా 360-డిగ్రీల కెమెరాను కలిగి ఉంది. దాని ఆధారంగా ఈ ఫీచర్ టాప్-ఎండ్ V వేరియంట్‌లో అందించారు. దీని ధర రూ. 9.63 లక్షల నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్).

Maruti Suzuki Fronx
మారుతి సుజుకి ఫ్రాంక్స్ టాప్ మోడల్ ఆల్ఫా ట్రిమ్ 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం దీని ధర రూ. 11.47 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Maruti Suzuki Brezza
360 డిగ్రీ కెమెరాతో మరో మారుతి సుజుకి  బ్రెజ్జా ZXI ప్లస్ వేరియంట్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 12.48 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Maruti Suzuki XL6
XL6 ఆల్ఫా వేరియంట్, ఎర్టిగా మరింత ప్రీమియం 6-సీట్ వెర్షన్‌లో 360-డిగ్రీ కెమెరాను చూడొచ్చు . దీని ధర రూ. 12.56 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

MG Astor
MG ఆస్టర్ దాని మోడళ్లలో 360 డిగ్రీల కెమెరాతో అందించబడే చౌకైన కారు. షార్ప్ వేరియంట్ నుండి ఈ కారు ధర రూ. 15.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Maruti Suzuki Grand Vitara
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆల్ఫా వేరియంట్ 360 డిగ్రీల కెమెరాను . దీని ధర రూ. 15.41 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Toyota Hyryder
టయోటా హైరైడర్ కూడా 360-డిగ్రీ కెమెరాను అందిస్తోంది. ఇది టాప్-ఎండ్ V ట్రిమ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15.91 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Also Read: కవాసకి నింజా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. 400 సీసీతో దుమ్ములేపుతుంది!

Kia Seltos
కియా సెల్టోస్ టాప్-ఎండ్ GTX ప్లస్, X-లైన్ వేరియంట్‌లలో 360-డిగ్రీ కెమెరాతో అందిస్తోంది. దీని ధర రూ. 19.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×