BigTV English

Special Bank Account For Women: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!

Special Bank Account For Women: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!

Special Bank Account For Women: HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి దేశంలోని ప్రముఖ బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్స్ సౌకర్యాలను అందిస్తాయి. ఇది ఉచిత బీమా, తక్కువ వడ్డీ రేట్లు, ఉచిత SMS ఛార్జీలు వంటి అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన మహిళ ఈ ఖాతాను తెరవవచ్చు. కానీ ఒక వ్యక్తితో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుమతి లేదు.


ఇంట్లోని చిన్నా పెద్దా ప్రతి అవసరాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటి మహిళ. ఆమె డబ్బును కూడా చాలా సమర్థవంతంగా మేనేజ్ చేస్తుంది. అటువంటి మహిళ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమాధానం లేదు. అందుకే బ్యాంకులు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను ప్రవేశపెట్టాయి.ఈ ప్రత్యేక పొదుపు ఖాతాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Also Read: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..? తెలియకపోతే ఈ టిప్స్ పాటించండి!


HDFC Women Savings Account
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి మహిళల సేవింగ్స్ అకౌండ్  ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ప్రమాద మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. అలానే ఆసుపత్రిలో చేరితే రూ.లక్ష కవరేజీ ఉంటుంది. మీరు ఈ సేవింగ్స్ ఖాతా ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతాను తెరిస్తే, 1 సంవత్సరం పాటు ఉచిత యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ (AMC) ఉంటుంది. ఆటో లోన్ వడ్డీ రేటులో కూడా తగ్గింపు లభిస్తుంది.

Bank Of Baroda Women Savings Account
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలో ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంది. అలాణే 70 ఏళ్లపాటు రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందజేస్తారు. దీనితో పాటుగా మీరు ఒక సంవత్సరం పాటు SMS అలర్ట్స్ కోసం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మహిళలు ఈ పొదుపు ఖాతా ద్వారా రుణం తీసుకుంటే వారికి 0.25 శాతం వడ్డీ లభిస్తుంది.

Also Read: పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక జీడీపీని కలిపినా ఎల్ఐసీతో సరిపోలడంలే..!

Union Bank Samriddhi saving account
యూనియన్ సమృద్ధి సేవింగ్స్ అకౌంట్‌ను ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించారు. ఇందులో డెబిట్ కార్డుతో రూ.50 లక్షల విమాన ప్రమాద బీమా లభిస్తుంది. అదే సమయంలో 5 లక్షల రూపాయల ఉచిత వ్యక్తిగత ప్రమాద కవరేజీ అందుబాటులో ఉంది. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం రూ.5 లక్షలు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్యాంక్ మొదటి సంవత్సరం మహిళా ఖాతాదారులకు లాకర్ అద్దెపై 50 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది. SMS అలర్ట్‌ల కోసం కూడా మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×