E-Paper
Advertisement

Kawasaki Ninja ZX-4RR Launched: కవాసకి నింజా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. 400 సీసీతో దుమ్ములేపుతుంది!

Kawasaki Ninja ZX-4RR Launched: కవాసకి నింజా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. 400 సీసీతో దుమ్ములేపుతుంది!

Kawasaki Ninja ZX-4RR Launched: కవాసకి ఇండియా తన కొత్త నింజా ZX-4RRని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సూపర్ స్పోర్ట్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.9.10 లక్షలుగా నిర్ణయించింది. దీని ధర నింజా ZX-4R కంటే రూ.61000 ఎక్కువ. ఈ సూపర్ బైక్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అట్రాక్ట్ లుక్‌తో ఉంటుంది. ఇండియా మార్కెట్‌లో నింజా ZX-4RR బైక్.. యమహా R15 400, KTM RC390, TVS అపాచీ 310RR వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Ninja ZX-4RR Design
నింజా ZX-4RR డిజైన్ గురించి చెప్పాలంటే ఇది కొత్త డిజైన్ గ్రాఫిక్స్‌తో కూడిన ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. దీనితో పాటు డ్యూయల్ పాడ్ LED హెడ్‌లైట్‌లు, స్ట్రైట్‌గా ఉండే విండ్‌స్క్రీన్‌ను కూడా ఉంటుంది. ఇది క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, ఫ్లష్-ఫిట్టెడ్ ఇండికేటర్‌లతో ఫుల్-ఫెయిరింగ్, స్ప్లిట్-టైప్ సీట్లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్, టేపర్డ్ టెయిల్ సెక్షన్, ఆకర్షణీయమైన LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఈ స్పోర్టీ బైక్‌ను లైమ్ గ్రీన్, మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కాంబినేషన్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌తో ఒకే వేరియంట్‌లో దక్కించుకోవచ్చు.

Also Read: రూ.46 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే వదలరు!

Ninja ZX-4RR Features
నింజా ZX-4RR బ్లూటూత్ కనెక్టివిటీతో 4.3-అంగుళాల ఫుల్-కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది. బైక్‌లో అనేక రకాల రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో స్పోర్ట్, రెయిన్, రోడ్. నింజా ZX-4RR షోవా USD ఫ్రంట్ ఫోర్క్స్,  ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్‌తో వస్తుంది. బైక్ ట్రాక్షన్ కంట్రోల్‌తో డ్యూయల్-ఛానల్ ABS పొందుతుంది. బ్రేకింగ్ కోసం బైక్‌కు 290 మిమీ డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 220 మిమీ వెనుక డిస్క్ బ్రేక్ ఇచ్చారు.

Also Read: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!

కవాసకి నింజా ZX-4RR 399cc లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది 14,500 rpm వద్ద 75 hp, 13,000 rpm వద్ద 39 Nm టాప్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్,  స్లిప్పర్ క్లచ్‌తో ట్యూన్ చేయబడింది. నింజా ZX-4RR దాని లైనప్‌లోని నింజా ZX-10R, Ninja ZX-6R లకు సమానంగా రైడింగ్ హ్యాండ్లింగ్ ఫీల్ అందిస్తుంది. 400సీసీ సెగ్మెంట్లో అత్యంత పవర్‌ఫుల్ బైక్ కూడా ఇదే.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×