BigTV English

Best Mileage Cars: కారు కొనాలనుకుంటున్నారా?.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కొత్త కార్లు ఇవే.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం..!

Best Mileage Cars: కారు కొనాలనుకుంటున్నారా?.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కొత్త కార్లు ఇవే.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం..!

Small families Budget cars: కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా చాలా మంది సామాన్యులు తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. ఎప్పుడైన కంపెనీలు తమ కార్లపై ఆఫర్లు ప్రకటిస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అని అనుకుంటుంటారు. మరికొందరికి ఆఫీసుకు వెళ్లడానికి, అలాగే తమ పిల్లలను స్కూల్‌కు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటుంటారు. అయితే అలా ప్లాన్ చేసుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు అతి తక్కువ ధరలో అందుబాటులో లభించే కార్ల ఇక్కడ ఉన్నాయి. కావున ఇప్పుడు కారు కొనాలంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బడ్జెట్ ధరలోనే కొనుక్కోవచ్చు.


Maruti Suzuki Alto: దేశీయ మార్కెట్‌లో కార్ల తయారీ, సేల్స్‌లో మారుతి సుజుకి ముందువరుసలో ఉంటుంది. అందులో ఆల్టో కె 10 అంటే వాహన ప్రియులకు మహా ఇష్టం. ఎందుకంటే తక్కువ ధర కలిగి.. అధిక మైలీజీని అందుస్తుంది కాబట్టి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే.. రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.39 నుంచి 24.90 కిమీ మైలేజీని ఇస్తుంది. అయితే సిఎన్‌జి మోడల్ కిలోకి 33.40 నుంచి 33.85 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఆల్టో ఒక చిన్న కుటుంబానికి ఉత్తమమైన కారుగా చెప్పుకోవచ్చు. ఇందులో 4 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో అందుబాటులో ఉంది.


Also Read: 26 కి.మీ మైలేజీ అందించే బెస్ట్ పెట్రోల్ కార్లు.. కేవలం రూ.10 లక్షల లోపే.. డోంట్ మిస్..!

అలాగే సేఫ్టీ కోసం.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కారును మీ కుటుంబ సభ్యుల కోసం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Maruti Suzuki Wagon R: ఈ కారు కూడా చిన్న కుటుంబాలకు మంచి ఎంపిక. భారత మార్కెట్లో దీని ధర రూ. 5.54 నుండి రూ. 7.38 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. ఈ కారు పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుండి 24.43 కిమీ మైలేజీని ఇస్తుంది. అదే సిఎన్‌జి వేరియంట్ కిలోకి 34.05 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. కొత్త వ్యాగన్ఆర్ మోడల్ గ్యాలంట్ రెడ్, పూల్‌సైడ్ బ్లూ, సుపీరియర్ వైట్‌తో సహా వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: 300కి పైగా మైలేజీతో దూసుకుపోయే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Renault KWID: Renault KWID హ్యాచ్‌బ్యాక్ రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 68 PS శక్తిని, 91 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. ఇది లీటరుకు 21.46 నుండి 22.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. క్విడ్ కారులో 5 మంది ప్రయాణించవచ్చు. దీనికి మంచి హెడ్‌స్పేస్ కూడా ఉంది.

ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ వంటి అనేక ఫీచర్లు అందించబడ్డాయి. భద్రత కోసం.. దీనికి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), HSA (హిల్ స్టార్ట్ అసిస్ట్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) అందించబడ్డాయి.

Tags

Related News

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Big Stories

×