BigTV English

Prabhas: ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే, అలా కాలర్ ఎత్తే అర్హత తనకు మాత్రమే ఉంది

Prabhas: ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే, అలా కాలర్ ఎత్తే అర్హత తనకు మాత్రమే ఉంది

Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తావన వచ్చినప్పుడు శివ సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అని మాట్లాడుతుంటారు. అంటే ఒక మూస ధోరణి లో సాగిపోతున్న తెలుగు సినిమాను పరుగులు పెట్టించాడు ఆర్జీవి. ఆ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో ఆ సినిమా ఒక సంచలనం. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది దర్శకులు వాళ్ళు అప్పటికే రాసుకున్న కొన్ని స్క్రిప్ట్స్ కూడా చింపేశారు.


అలానే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. ఒక సినిమా కోసం ఒక హీరో దాదాపు ఐదేళ్లు టైం కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో బాహుబలి అనే సినిమాను నమ్మి చేశాడు ప్రభాస్. ఈ సినిమా కేవలం ప్రభాస్ కెరియర్ కి మాత్రమే ప్లస్ అవడం కాకుండా ఏకంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్లస్ అయింది. సినిమా తర్వాత చాలామంది పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. తెలుగు సినిమా పరిశ్రమను చూసే స్థాయి కూడా మారిపోయింది.

అసలైన అర్హత ప్రభాస్ కు ఉంది 


ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొదట పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సాధించుకుంది ప్రభాస్. బాహుబలి సినిమాతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. అలానే కల్కి సినిమాతో కూడా 1000 కోట్లు రాబట్ట గలిగాడు ప్రభాస్. ఇక సలార్ సినిమాకి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తర్వాత కూడా ఏ రోజు అతను అతిగా మాట్లాడలేదు. స్టేజ్ పైన కాలర్ ఎగరేసి చెప్పలేదు. ఇప్పటికీ ప్రభాస్ పైన చాలామందికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది అంటే దానికి కారణం ప్రభాస్ హంబుల్ అండ్ జెన్యూన్. మామూలుగా ప్రభాస్ అందరిని డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాడు. వాస్తవానికి ప్రభాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అసలైన డార్లింగ్ అని చెప్పాలి.

సినిమా పైన అభిమానం 

ఇక ప్రభాస్ విషయానికి వస్తే కేవలం తన సినిమాలు మాత్రమే ప్రమోట్ చేయడం కాకుండా, మిగతా సినిమాలకు కూడా తన వైపు నుంచి అద్భుతమైన సపోర్ట్ ఇస్తాడు. కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ సినిమాలకు అభినందనలు తెలియజేస్తాడు. అలానే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాకి ముందుకు వచ్చి మరి ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. అలానే గతంలో విశ్వరూపం సినిమా వివాదం వచ్చినప్పుడు కూడా ప్రభాస్ ముందుకు వచ్చి కమల్ హాసన్ పక్కన కూర్చుని మాట్లాడారు. ఇలా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా ప్రభాస్ లాంటి హీరో ఉండటం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమని చెప్పాలి.

Also Read: Coolie: 14 న సినిమా రిలీజ్ అయితే 15న ఈవెంట్, ఎవరా క్రియేటివ్ జీనియస్.?

Related News

The Paradise film: కీలక సీక్వెన్స్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. వాడి జడలు ముట్టుకుంటే అంటూ!

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

Big Stories

×