SBI Card New Rules: ట్రెండ్ తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకులు. ఒకప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల సదుపాయాలు ఇచ్చేవారు. వాటిని క్రమంగా తొలగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీన్ని గమనించిన ఎస్బీఐ, వివిధ కార్డులపై ఇస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగించింది.
ఆగష్టు 11 నుంచి ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించి రకరకాల కార్డులను వినియోగిస్తున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆగస్టు 11 నుంచి కొత్త రూల్స్ వచ్చేశాయి. వివిధ కార్డులపై అందిస్తోన్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగించింది.
నార్మల్‌గా రూ.50 లక్షలు, రూ. 1 కోటి బీమా ఆ బ్యాంక్ నుంచి అందదు. సవరించిన కొత్త రూల్స్ ఆగష్టు 11 నుంచి అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్ కార్డులు వాడే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ కార్డులపై ఎలాంటి బెనిఫిట్స్ తొలగిస్తున్నారనేది ఒక్కసారి చూద్దాం.
ఎస్‌బీఐకి చెందిన పలు కార్డులపై ఇస్తున్న కోటి రూపాయల విలువైన కాంప్లిమెంటరీ విమాన ప్రమాద బీమా ఉండదు. ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లిస్ట్‌లో యూకో బ్యాంక్ SBI కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కార్డ్ ఎలైట్, పీఎస్‌బీ SBI కార్డ్ ELITE, కేవీబీ SBI కార్డ్ ELITE, కేవీబీ SBI సిగ్నేచర్ కార్డ్, అలహాబాద్ బ్యాంక్ SBI కార్డ్ ELITE కార్డులు ఉన్నాయి.
ALSO READ: ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు
బహుళ భాగస్వామ్య బ్యాంకులలో కలిసి PRIME, ప్లాటినం కార్డులపై 50 లక్షల రూపాయల కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని తొలగించింది ఎస్‌బీఐ. పాపులర్ కార్డుల్లో యూకో బ్యాంక్ SBI PRIME, కేవీబీ SBI ప్లాటినమ్ కార్డులు వంటివి ఉన్నాయి.
ఈ రెండు కేటగిరీల్లో 15 క్రెడిట్ కార్డులపై ఆయా బెనిఫిట్స్ తొలగించినట్లు వెల్లడించింది ఎస్‌బీఐ కార్డు. గత నెలలో కొన్నికార్డులపై కాంప్లిమెంటరీ కింద ఇస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తొలగించింది. జూలై 15 నుంచి రూ. 1 కోటి, రూ. 50 లక్షల సదుపాయాన్ని తొలగించిన విషయం తెల్సిందే.