Delhi Politics: బీహార్‌లో ఓటర జాబితా వ్యవహారంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి. పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీలతో మిగతా పార్టీల నేతలను అరెస్టు చేశారు.
అసలేం జరిగింది? బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి. ‘పార్లమెంట్ టు ఈసీ’ వరకు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సదరు ఎంపీలను నిలువరించే ప్రయత్నం చేశారు.
చివరకు విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించారు. నిరసనలు కంటిన్యూ చేశారు. పరిస్థితి గమనించిన ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను అరెస్టు చేశారు. అక్కడ నుంచి బస్సులో వారిని మరో ప్రాంతానికి తరలించారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఎంపీలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్, ప్రియాంక గాంధీ, ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. పోలీసులు అరెస్టులు చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ALSO READ: మరో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం, విమానంలో కాంగ్రెస్ ఎంపీలు
ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్తున్నప్పుడు భారత కూటమికి చెందిన ఎంపీలను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఓట్ల దొంగతనం నిజం ఇప్పుడు దేశం ముందు ఉందన్నారు. తాము చేస్తున్న ఈ పోరాటం రాజకీయమైనది కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి-ఒక ఓటు హక్కును కాపాడటానికి చేస్తున్న పోరాటమన్నారు. ఐక్య ప్రతిపక్షంతోపాటు దేశంలో ప్రతి ఓటరు డిమాండ్ చేస్తున్నది అవకతవకలు లేని ఓటరు జాబితా అని అన్నారు.
మరోవైపు బీహార్ సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈసీకి లేఖ రాశారు. తొలుత అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం, చివరకు కేవలం 30 మంది విపక్ష ఎంపీలు రావాలని చెబుతూ సోమవారం మధ్యాహ్నానికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం పోరాటం ప్రారంభించారని అన్నారు. ప్రతి భారతీయుడి ఓటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
As @RahulGandhi ji started fight for democracy & restoration of the sacrosanct power of every Indian’s vote …BJP has restored to a dastardly act of detaining him and @priyankagandhi ji & other Congress leaders.
Jails can’t crush the resolve or silence the voice of #RahulGandhi… https://t.co/bAnySfPcFF
— Revanth Reddy (@revanth_anumula) August 11, 2025