Brahmanandam: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బ్రహ్మానందం (Brahmanandam) ఒకరు. కమెడియన్ గా వందల సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా వస్తుంది అంటే తప్పకుండా అందులో బ్రహ్మానందం గారికి ఒక పాత్ర ఉండేలా దర్శక నిర్మాతలు కూడా జాగ్రత్తలు తీసుకునేవారు. అంతలా ఈయనకు గుర్తింపు లభించిందని చెప్పాలి. ఇక బ్రహ్మానందం కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన కుమారులు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇండస్ట్రీకి దూరంగా బ్రహ్మానందం చిన్న కొడుకు…
బ్రహ్మానందం వారసుడిగా తన పెద్ద కుమారుడు గౌతమ్(Gautham) ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టారు. అయితే ఈయన రెండు మూడు సినిమాలలో నటించిన పెద్దగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా సినిమాలు సక్సెస్ కానీ నేపథ్యంలో గౌతమ్ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. వ్యాపారాలలో నెలకు కోట్లలో ఆదాయం ఆర్జిస్తూ బిజినెస్ మెన్ గా సక్సెస్ అయ్యారు. ఇక బ్రహ్మానందంకు మరొక కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇతని పేరు సిద్ధార్. (siddarth)విదేశాలలోనే చదువుకుంటూ అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. అయితే గత రెండు సంవత్సరాల క్రితం సిద్దార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్య(Aishwarya)తో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
బ్రహ్మానందం ఇంట్లో ఉపాసన, రాంచరణ్…
ఇలా సిద్దార్థ్ సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు. అయితే తాజాగా సిద్దార్థ్ తండ్రి అయ్యారని బ్రహ్మానందం మరోసారి తాతయ్య అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ కు ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో కొడుకు కూడా తండ్రిగా ప్రమోట్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయం తాజాగా బయటపడటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదివారం బ్రహ్మానందం ఇంటికి ఉపాసన(Upasana) రాంచరణ్(Ramcharan) దంపతులు భోజనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మరోసారి తాతయ్య అయిన బ్రహ్మానందం…
ఇలా బ్రహ్మానందం గారి ఇంట్లో భోజనానికి వెళ్లిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. ఇందులో భాగంగా బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ చేతిలో తన బిడ్డను ఎత్తుకొని కనిపించారు. దీంతో బ్రహ్మానందం గారు మరోసారి తాతయ్య అయ్యారు అంటూ అభిమానులు బ్రహ్మానందం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అమ్మాయి పుట్టిందా లేక అబ్బాయి పుట్టారా అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇక బ్రహ్మానందం సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించిన ఆ పాత్ర ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటే మాత్రమే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వయసు పై బడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా సినిమా అవకాశాలను తగ్గిస్తున్నారని చెప్పాలి.
Also Read: War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!