Murli vijay : టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ (Murali Vijay) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం విజయ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతను ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెట్ ప్లేయర్ కి కుమార్తె తో కలిసి భోజనం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో మురళీ విజయ్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హెడెన్ తో కలిసి ఉండటంతో ఆ ఫొటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి ఫొటో బయటపడగానే వీరిద్దరికి ఏదో రిలేషన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మురళీ విజయ్ లేదా గ్రేస్ హెడెన్ ఈ సంబంధం గురించి ఏమీ స్పందించలేదు. మీడియాతో కూడా వారు ఏమీ చెప్పలేదు.
Also Read : Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా
అలా విజయ్ రిటైర్మెంట్..
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ మాజీ భార్య నికితాతో మురళీ విజయ్ రిలేషన్ షిప్ గురించి వార్తలు వచ్చాయి. నికితా-దినేష్ కార్తిక్ 2007లో వివాహం చేసుకున్నారు. వారు వివాహం చేసుకున్న కొద్ది సంవత్సరాలకే 2012లో విడాకులు తీసుకున్నారు. ఇక నికిత 2012లోనే మురళీ విజయ్ ని పెళ్లాడింది. వీరి పెళ్లి జరిగి దాదాపు 13 ఏళ్లు అయింది. నికిత తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో తన భర్త మురళీ విజయ్ తో చాలా ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఇక రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడాడు మాజీ భారత అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 2018 వరకు భారత టెస్టు జట్టుల సాధారణ సభ్యుడు. 17 ఏళ్ల మురళీ విజయ్ చెన్నైలో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత తమిళనాడు అండర్-22 జట్టులో ఎంపికయ్యాడు. ఆయన 2006లో తమిళనాడు సీనియర్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అతని మొదటి ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ 2006-07 రంజీ ట్రోఫీలో అత్యధిక రన్-స్కోరర్‌లలో ఒకడుగా గుర్తింపుపొందాడు. 2023 జనవరి 30న మురళీ విజయ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ ఫొటో వైరల్
తాజాగా గ్రేస్ హెడెన్ తో ఉన్న ఓ ఫొటో వైరల్ అయిన తతరువాత కూడా మురళీ విజయ్ భార్య నికితా విజయ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ అందాల భామ ఎవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కుమార్తె. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. ఐపీఎల్ 2025 క్లైమాక్స్‌కి వచ్చిన సమయంలో గ్రేస్ హేడన్ తిరిగి రావడం సోషల్ మీడియాలో ఆమె పేరు, ఫోటోలు వైరల్ గా మారాయి. గ్రేస్ హేడన్‌కు క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడన్ కుమార్తె అనే పేరున్నా.. ఆమె తనదైన శైలి, నైపుణ్యంతో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గాను, స్టైల్ రిపోర్టర్‌గాను ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె తండ్రి పేరుతో మాత్రమే కాకుండా.. తానే స్వయంగాా ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
?igsh=NHpxcHhpMzNwaTdy