Bajaj Riki E-Rickshaw Launch: ప్రముఖ ఆటోమోబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ఎప్పటికప్పుడు సరికొత్త బైక్ లు, త్రీవీలర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా రికి ఈ- రిక్షాలను అందుబాటులోకి తీసుకొచ్చింది వీటి ద్వారా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-రిక్షా మార్కెట్ లోకి వ్యూహాత్మక అడుగులు వేసినట్లు అయ్యింది. సాంప్రదాయ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లకు మించి తన పోర్ట్ ఫోలియోను విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఇ-రిక్షా విభాగం గణనీయమైన పెరుగుదలను సాధిస్తోంది. నెలకు ఏకంగా 45,000 కంటే ఎక్కువ వాహనాలను అమ్ముతోంది. తాజాగా విడుదల చేసిన బజాజ్ రికి రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. P4005 ప్యాసింజర్ వేరియంట్, C4005 కార్గో వేరియంట్. ప్యాసింజర్ రిక్షా ధర రూ. 1.91 లక్షలుగా నిర్ణయించగా, కార్గో వేరియంట్ ధర రూ. 2.01 లక్షలుగా కన్ఫార్మ్ చేసింది.
బజాజ్ రికి P4005 5.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇది 149 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను కలిగి ఉంటుంది. ఇది ఈ- రిక్షా ప్యాసింజర్ విభాగంలో ఇప్పటి వరకు ఏ ఆటోకు సాధ్యం కాని రేంజ్ ని అందిస్తుంది. మరోవైపు, కార్గో వేరియంట్ 164 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ వేరియంట్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ-రిక్షా 4.5 గంటల్లో ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. బజాజ్ రెండు వేరియంట్‌లపై మూడు సంవత్సరాల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తుంది. ఈ విభాగంలోని ఇతర ఇ-రిక్షాల మాదిరిగా కాకుండా, బజాజ్ రికి మోనోకోక్ ఛాసిస్, ఇండిపెండెంట్ సస్పెన్షన్, హైడ్రాలిక్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది మరింత మెరుగైన మన్నిక, స్థిరత్వాన్ని అందిస్తుంది. సురక్షితమైన, సున్నితమైన రైడ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.
ఇక పాట్నా, మొరాదాబాద్, గౌహతి, రాయ్ పూర్ లో ఇప్పటికే రికీ అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసుకుంది. రికి ఈ-రిక్షా ప్రస్తుత ఈ-రిక్షా మార్కెట్ లో దీర్ఘకాలిక విశ్వసనీయత, భద్రతా సమస్యలను పూర్తి పరిష్కరించేలా ఉంటుంది. బజాజ్ ప్రస్తుత ప్రొడక్ట్స్ లో ఉన్న ముఖ్యమైన సమస్యలలో పరిమిత రేంజ్, లెడ్ యాసిడ్ బ్యాటరీ తుప్పు, బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు సరైన సర్వీసింగ్ మౌలిక సదుపాయాలు లేవు. కానీ, ఇప్పుడు బజాజ్ కంపెనీ వాటన్నింటికీ పరిష్కారం చూపించేలా దీనిని రూపొందించింది.
Read Also: డిసెంబర్ లో సగానికి పైగా బ్యాంక్ హాలీడేస్, ఫుల్ లిస్ట్ ఇదే!
బజాజ్ ఆటో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం అంతటా 100కి పైగా పట్టణాల్లో రికిని ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత నెమ్మదిగా దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. బజాజ్ నుంచి వచ్చే త్రివీలర్లకు వినియగదారులలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో రికి ఈ-రిక్షా కూడా మంచి ఆదరణ దక్కించుకుంటుందని కంపెనీ భావిస్తోంది.
Read Also: సరికొత్తగా టాటా సియెర్రా.. జస్ట్ 11 లక్షల నుంచే అందుబాటులోకి!