E-Paper
Advertisement

ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు.. ప్రస్తుతం ఏయే దేశాల్లో చెలామణిలో ఉన్నాయంటే?

ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు.. ప్రస్తుతం ఏయే దేశాల్లో చెలామణిలో ఉన్నాయంటే?
Advertisement

‘నోట్ల రద్దు’.. ఈ మాట ఎప్పుడు వినపడినా దాదాపు గుండెజారిపోతుంది. అయితే, ఇప్పుడు అంతా వాడేది డిజిటల్ మనీ కాబట్టి.. అప్పట్లా ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ.. బ్లాక్ మనీ కలిగిన సంపన్నులకు, నకిలీ నోట్ల ముఠాలకే కష్టాలన్నీ. ఇప్పుడు ఈ నోట్ల రద్దు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. మళ్లీ మన ప్రభుత్వం నోట్లు రద్దు చేసి, వాటి స్థానంలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తీసుకురావాలని ఆలోచిస్తుందట. ఆల్రెడీ దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసేసుకుంది. మరికొన్ని నెలల్లోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఇన్నాళ్లూ కాగితపు నోట్లను వాడిన మనకు.. ‘ప్లాస్టిక్ నోట్లు’ వస్తున్నాయంటే కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. అయితే, మీరు అనుకున్నట్లు ఈ ప్లాస్టిక్ నోట్లు.. డెబిట్, క్రెడిట్ కార్డుల్లా ఉండవు. కాగితాల్లానే ఉంటాయి. అవి ఎప్పటికి చిరగవు కూడా. ఇప్పటికే 60 పైగా దేశాలు ఈ ప్లాస్టిక్ నోట్లు వాడుతున్నాయి.

ఏయే దేశాలు వాడుతున్నాయ్?

ప్రపంచవ్యాప్తంగా సుమారు 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను వాడుతున్నారు. అయితే, వీటిని పాలిమర్ నోట్లు అంటారు. ఇవి అచ్చం పేపర్ తరహాలోనే ఉంటాయి. చిరగవు, తడిచిపోవు, మురికి పట్టవు. ఎప్పుడూ ఫ్రెష్‌గా క్లీన్‌గా ఉంటాయి. ఈ పాలిమర్ కరెన్సీని కనిపెట్టిన ఘనత ముందుగా ఆస్ట్రేలియాకే దక్కుతుంది.1988లోనే ఆ దేశంలో పాలిమర్ నోట్లు వాడుకలోకి వచ్చాయి. ఆ తర్వాత యూకేలో 5, 10, 20, 50 పౌండ్ల నోట్లను పాలిమర్‌లోకి మార్చారు. తర్వాత కెనడాలో 2011 నుంచి కాగితపు నోట్లను రద్దు చేసి పాలిమర్ నోట్లను వాడుతున్నారు. న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, రుమేనియా, థాయిలాండ్, మెక్సికో వంటి దేశాల్లో కూడా ప్లాస్టిక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి.

పాలిమర్ నోట్లను ఎలా తయారు చేస్తారు?

Advertisement

బయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలిప్రొపైలీన్ (BOPP) అనే ప్రత్యేకమైన సింథటిక్ ప్లాస్టిక్ పొరతో ఈ నోట్లను తయారు చేస్తారు. మనం వాడే సాధారణ కాగితం తరహాలోనే ఇవి చాలా తేలికగా, మడతపెట్టేందుకు వీలుగా ఉంటాయి. కత్తెరతో కావాలని కత్తిరిస్తే తప్పా చిరగవు. ఎక్కువ రోజులు మన్నికలో ఉంటాయి. కాబట్టి.. ఆర్‌బీఐకి పదే పదే కొత్త నోట్లను ముద్రించే పని తప్పుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.

ముందు ఏ నోట్లను మార్చుతారు? ఏయే నగరాల్లో వాడతారు?

ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి తేవాలంటే పాత కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేయక తప్పదు. అయితే, ఈ విషయంలో మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆర్‌బీఐ ముందుగా రూ.10, రూ.20 నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి విడుదల చేయనుంది. ముందుగా కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా వంటి నగరాల్లో వాడుకలోకి తీసుకురానుంది. ఎందుకంటే.. ఈ నగరాల్లో వాతావరణం వేర్వేరుగా ఉంటుంది. అక్కడి పరిస్థితులను పాలిమర్ నోట్లు తట్టుకుంటాయా లేదా.. ఎన్నాళ్లు మన్నికలో ఉంటాయనే విషయాలను ముందుగా పరిశీలిస్తారు.

దేశ భద్రతకు చాలా ముఖ్యం

Advertisement

నకలీ నోట్లు భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్లాస్టిక్ నోట్లను చెలామణిలోకి తీసుకురావడమే సరైన మార్గం అని ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి లేదా ఐఎస్ఐ వంటి పాక్ గూఢచారి సంస్థల మద్దతుతో ఉగ్రమూకలు హైక్వాలిటీ నోట్లను ఇండియాలోకి అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాస్టిక్ నోట్లు చెలామణిలోకి వస్తే.. వారి ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లే. ఈ నోట్లలో మైక్రో ఆప్టికల్, హాలోగ్రామ్స్ ఉపయోగిస్తారు. కాంతి పడే కోణాన్ని బట్టి ఇవి రంగులు మారుతాయి. అందులోని నెంబర్లు 3డీ చిత్రాల తరహాలో కనిపిస్తాయి. వీటిని కాపీ చేసి, డూప్లికేట్ చేయడం సాధారణ స్కానర్లు, కలర్ ప్రింట్ల వల్ల కూడా సాధ్యం కాదు. ప్లాస్టిక్ నోట్ల వల్ల ఉగ్రవాదులకు అందే ఆర్థిక సహాయం తుడిచిపెట్టుకుపోతుంది. అయితే, కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు కాస్త ఎక్కువే. కానీ, భవిష్యత్తులో కొత్త నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చుతో పోల్చితే తక్కువే.

ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే మరిన్ని ముఖ్యమైన ప్రయోజనాలు

⦿ ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి. సాధారణ కాగితపు నోట్ల కంటే 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. త్వరగా చిరగవు కూడా.
⦿ నీటిలో పడినా తడవవు. నూనె మరకలు కూడా అంటుకోవు. బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకోవు. బట్టలతోపాటు వాషింగ్ మెషీన్‌లో వేసినా ఏమీ కావు.
⦿ ఇవి వాడుకలోకి వస్తే.. నకిలీ నోట్లు చేసేవారికి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రత్యేకమైన హోలోగ్రామ్‌లు వాడతారు. వాటిని కాపీ చేయడం దాదాపు అసాధ్యం.
⦿ నోట్లు త్వరగా పాడవ్వకపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా కొత్త నోట్లను ముద్రించే ఖర్చు తగ్గుతుంది.
⦿ ఈ ప్లాస్టిక్ నోట్లు పాడైపోతే రిసైకిల్ చేసి కుర్చీలు, కుండీలు, ఇతర వస్తువులుగా మార్చవచ్చు.
ప్రారంభంలో ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాటి దీర్ఘకాలిక మన్నిక మరియు నకిలీ నోట్ల నియంత్రణ దృష్ట్యా ఇవి ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభదాయకం. డిజిటల్ పేమెంట్స్ శరవేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో, చేతిలో ఉండే కరెన్సీని కూడా అంతే స్మార్ట్‌గా మార్చేందుకు ప్లాస్టిక్ నోట్లు ఎంతగానో దోహదపడతాయి.

Also Read: ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Related News

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Big Stories

Advertisement
×