E-Paper
Advertisement

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?
Advertisement

RBI Plan: దేశంలో కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి అంతా రెడీ చేసింది. దీన్ని ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి.

ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయోచ్-ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ. త్వరలో పాలిమర్ నోట్లకు సంబంధించి తొలి పైలట్ విడతను ప్రారంభించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ తొలుత రూ.10, రూ.20 వంటి చిన్న విలువ గల నోట్లతో ప్రారంభం కావచ్చని సమాచారం.

Advertisement

వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి-ఫలితాల ఆధారంగా 2027 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ఆర్‌బిఐ అడుగులు వేస్తుందని వర్గాలు అందులోని సారాంశం. దీనిపై అభిప్రాయాలను సేకరించి అప్పుడు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. పాలిమర్‌ నోట్లు వచ్చినప్పటికీ పేపర్‌ కరెన్సీ ఎప్పటి మాదిరిగా కొనసాగుతుందని ఆయా వర్గాలు చెబుతున్నారు. ఈ లెక్కన  దశలవారీగా పాలిమర్‌ నోట్లు మార్కెట్‌లోకి రానున్నాయి.

టెండర్లకు ఆహ్వానం-పాలిమర్‌ కరెన్సీ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజుల కిందట వెల్లడించారు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. కొత్త తరహా కరెన్సీ నోట్లను ముద్రించడానికి ప్రత్యేకమైన పదార్థం పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్‌బీఐ నోట్ల ప్రింటింగ్ విభాగం గ్లోబల్ టెండర్‌ను జారీ చేసిందని తెలుస్తోంది. ఈఓఐ కింద బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 18 వరకు నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తొలుత చిన్న నోట్లు చెలామణి-కాగితపు కరెన్సీ కంటే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ మన్నికైనవి. ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. ప్రస్తుతం నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లను ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి మన్నిక ఎక్కువకాలం ఉంటుంది. పదేపదే ముద్రించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కాలక్రమేణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ఈ పాలిమర్‌ నోట్ల ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆర్‌బిఐ పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం మొదటిసారి కాదు.

ALSO READ: పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలలో పాలిమర్ నోట్లు చలామణిలో ఉన్నాయి. తొలి మొదట ఆస్ట్రేలియాలో ఈ తరహా నోట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కెనడా, యూకె, సింగపూర్, న్యూజిలాండ్, మలేషియా, థాయ్‌లాండ్, రొమేనియా, బ్రూనైలలో ప్రవేశపెట్టారు. తాజాగా భారతదేశంలో వాటిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ లెక్కన మరోసారి నోట్ల రద్దు ఉండే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు. ప్లాస్టిక్ నోట్లు రాగానే పాత నోట్లను ఆర్బీఐ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 2027 చివర లేకుంటే 2028 లో పాత నోట్ల రద్దు ఉండే అవకాశముందని అప్పుడే ప్రచారం మొదలైపోయింది.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×