E-Paper
Advertisement

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!
Advertisement

Education Hub: వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచి ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సీఎం ఆగ్రహం..

ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై తనిఖీ చేయడమే కాకుండా ఒక రోజు సైట్‌లోనే బస చేస్తానని చెప్పారు.

Advertisement

Also Read: Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

వారంలోగా పట్టాలు..

పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్‌ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Advertisement

Also read: NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×