E-Paper
Advertisement

LPG vs PNG: మధ్యతరగతి ఇంటికి.. PNG బెటరా? లేదంటే LPG మంచిదా?

LPG vs PNG: మధ్యతరగతి ఇంటికి.. PNG బెటరా? లేదంటే LPG మంచిదా?
Advertisement

LPG vs PNG: ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య చెలరేగిన యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్రం.. ఎల్‌పీజీ (Liquefied petroleum gas – LPG) నుంచి పీఎన్‌జీ (Piped Natural Gas- PNG) సామాన్యులకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు PNG, LPG మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటి? దేనివల్ల సామాన్యుడికి ఎక్కువ ప్రయోజనం ఉంది? ఈ కథనంలో పరిశీలిద్దాం.

సౌకర్యం, లభ్యత

మనం సాధారణంగా వాడే ఎరుపు రంగు సిలిండర్లలో ఎల్‌పీజీ గ్యాస్ ఉంటుంది. అయితే దీని కోసం ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ గ్యాస్ అయిపోతే కొత్త సిలిండర్ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అదే PNGకి మారితే.. ఇది పైపుల ద్వారా నేరుగా మీ వంటగదిలోకి సరఫరా అవుతుంది. దీనికి బుకింగ్ అవసరం లేదు. 24 గంటల పాటు నిరంతరంగా గ్యాస్ అందుబాటులో ఉంటుంది. సిలిండర్ మార్చే ఇబ్బంది కూడా ఉండదు.

భద్రత (Safety)

Advertisement

సాధారణంగా ఎల్పీజీ గాలి కంటే బరువుగా ఉంటుంది. కాబట్టి లీకేజీ జరిగితే అది నేల మీద పేరుకుపోయి ఎక్కువ నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే సిలిండర్లలో గ్యాస్ ను అధిక పీడనం (High Pressure) వద్ద నిల్వ చేయడం వల్ల ప్రమాద ముప్పు మరింతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే PNG విషయానికి వస్తే ఇది గాలి కంటే తేలికైనది. లీకేజీ జరిగినప్పుడు ఇది త్వరగా గాలిలో కలిసిపోతుంది. కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. పైపుల్లో గ్యాస్ చాలా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది కాబట్టి ఇది గృహ వినియోగానికి కూడా చాలా సేఫ్ అని చెప్పవచ్చు.

ఖర్చు పరంగా చూస్తే..

LPG సిలిండర్ తీసుకున్నప్పుడే పూర్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.900 వరకు ఉంది. రవాణా ఖర్చులు, డెలివరీ ఛార్జీలు ఇందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే PNG విషయానికి వస్తే.. ఎంత గ్యాస్ వాడతారో దానికి మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది (కరెంట్ బిల్లు లాగా). ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ సుమారు 20% నుండి 30% వరకు చౌకగా ఉంటుంది. కాకపోతే మొదట కనెక్షన్ తీసుకోవడానికి కొంత డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

వంటగదిలో స్థలం..

Advertisement

LPG సిలిండర్లను ఉంచడానికి వంటగదిలో లేదా బయట కొంత స్థలం అవసరమవుతుంది. డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నట్లయితే.. ఖాళీ అయిన సిలిండర్ కోసం కూడా కొంత స్థలాన్ని కేటాయింటాల్సి ఉంటుంది. అయితే పీఎన్‌జీ ఎలాంటి స్టోరేజ్ స్పేస్ అవసరం లేదు. కేవలం ఒక మీడియం సైజు పైపు మాత్రమే అవసరం. అది కూడా మీటర్ పొడవు మాత్రమే ఉంటుంది. దీనివల్ల వంటగదిలో స్థలం చాలా వరకూ ఆదా అవుతుంది.

Also Read: Sony Bravia 8 II OLED: ఓరి దేవుడా.. సూపర్ క్లాస్ సోనీ టీవీపై.. ఎగిరిగంతేసే డిస్కౌంట్!

ఫైనల్‌గా ఏది మంచిది?

మీరు నగరాల్లో నివసిస్తూ మీ ప్రాంతంలో పైప్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉంటే PNG ఎంచుకోవడం అన్ని విధాలా లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా అత్యంత సురక్షితమైనది. ఒకవేళ పైప్‌లైన్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికి LPG ఏకైక మార్గంగా నిలుస్తుంది. కాబట్టి గ్యాస్ సిలిండర్లను వాడక తప్పదు.

Also Read: Realme P4 Lite 5G: బడ్జెట్ ఫోన్ వచ్చేసిందోచ్.. HD+ డిస్ ప్లే, 7000mAh బ్యాటరీ.. నిజంగా అదిరిపోయింది భయ్యా!

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×