E-Paper
Advertisement

Telangana Assembly Session 2026: రాజీవ్ ఆరోగ్య స్కీమ్, సీఎం రిలీఫ్ ఫండ్స్, ముఖ్యమంత్రి ప్రకటన

Telangana Assembly Session 2026: రాజీవ్ ఆరోగ్య స్కీమ్,  సీఎం రిలీఫ్ ఫండ్స్, ముఖ్యమంత్రి ప్రకటన
Advertisement

Telangana Assembly Session 2026: వైద్యంలో నిరంత‌రం కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతాయని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వైద్య-ఆరోగ్య శాఖ ఒక స‌వాల్ లాంటిదన్నారు. భ‌విష్య‌త్తులో ఈ శాఖలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో స‌భ్యులు ఇచ్చే స‌ల‌హాలను స్వీక‌రిస్తామని తేల్చి చెప్పారు.

వైద్యశాఖలో మార్పులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

Advertisement

గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ పండ్ నిధుల వ్యవహారంపై ఓ ప్రకటన చేశారు. విద్య‌, వైద్యం మా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అని తేల్చి చెప్పారు. విద్య అందుబాటులో ఉన్నా నాణ్య‌మైనది లేదన్నారు. పేద‌ల విద్య , వైద్యం విష‌యంలో ఒక్క రూపాయి కూడా కోత విధించలేదని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని నిధులు ఇస్తామని సభలో తేల్చి చెప్పారు.

కుల‌గ‌ణ‌న‌లో భాగం చేసిన జ‌న‌గ‌ణ‌న ఆధారంగా కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇందిర‌మ్మ జీవిత బీమా ఇవ్వ‌బోతున్నామని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి దీనివ‌ల్ల ప్ర‌తి కుటుంబానికి ఆరోగ్య ధీమా క‌ల్పించ‌బోతున్నట్లు తెలిపారు. వేలాది మంది మన డాక్ట‌ర్లు విదేశాల్లో ప‌ని చేస్తున్నారని, వారి కోసం ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించుతున్నట్లు తెలిపారు.

Advertisement

వాళ్లు మ‌న ప్రాంతానికి వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ఆస్ప‌త్రుల్లో సేవ‌లు అందించ‌డానికి వీలవుతుందన్నారు. మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా వెబ్‌సైట్ రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. వ‌రంగ‌ల్, అల్వాల్, ఎల్‌బీ న‌గ‌ర్, స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెష‌లైజేష‌న్ ఆస్ప‌త్రులుగా మారుస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య శ్రీ, సీఎం రీలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధుల‌ను ఆయా ఆసుపత్రులకు కేటాయిస్తామన్నారు.

రాజీవ్ ఆరోగ్య స్కీమ్, సీఎం రిలీఫ్ ఫండ్స్ నిధుల చెల్లింపు వివరాలు

గోషామ‌హ‌ల్‌లో 30 ఎక‌రాల్లో 3000 కోట్ల‌తో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అద‌నంగా 10 వేల బెడ్‌లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకువ‌స్తున్నట్లు వెల్లడించారు. టిమ్స్ ఆసుపత్రుల ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఇంజ‌నీర్ అయిన‌ప్ప‌టికి సోష‌ల్ డాక్ట‌ర్‌గా పేద‌ల క‌ష్టాల‌పై ఆయనకు సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉందన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్ప‌టివ‌ర‌కు 2046 కోట్ల రూపాయ‌లు ఇచ్చామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆరోగ్య శ్రీ కోసం రూ.2400 కోట్ల ఖ‌ర్చు చేశామన్నారు. పేద‌ల వైద్యం కోసం 4500 కోట్ల రూపాయ‌లను మా ప్ర‌భుత్వం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 35 మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయని, వాటికి రోగులు రావ‌డం లేదన్నారు.

పేద‌లు వైద్యం కోసం వెళ్లే ద‌గ్గ‌ర స‌రైన డాక్ట‌ర్లు లేవన్నారు. ఆరోగ్య శ్రీ రోగుల‌ను టీచింగ్ కాలేజీల‌కు పంపే ఆలోచ‌న చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఆరోగ్య శ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఆయా ఆస్ప‌త్రుల‌కు ఇస్తామన్నారు. దీనివ‌ల్ల ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ మెరుగు పడుతుందని, ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌ను గ్రూప్ వ‌న్ అధికారికి ఇవ్వాల‌ని అనుకుంటున్నట్లు తెలిపారు.

ALSO READ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మార్చి 31న లక్ష ఇళ్ల పంపిణీ.. మంత్రి కీలక నిర్ణయం!

డిసెంబ‌ర్ 6, 2023 నుంచి ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌తి నెల యావ‌రేజ్‌గా రూ. 89 కోట్లను ప్రభుత్వం ఖ‌ర్చు చేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య బ‌కాయిల వ‌ల్ల ప్రైవేటు ఆస్ప‌త్రులు మూత ప‌డుతున్నాయ‌ంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ బ‌కాయిలు పెట్టిందని, వాటిని మోస్తూనే ఉన్నామన్నారు.

2023, డిసెంబర్ ఏడు నాటికి రూ. 627 కోట్లు పెండింగ్ బ‌కాయిలుగా మాకు భారం వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజు 2408 కోట్ల రూపాయ‌ల‌ను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించామన్నారు. అందులో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రూ. 927 కోట్ల‌ు, ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు రూ. 1480 కోట్లు చెల్లించినట్టు వివరాలు బయటపెట్టారు. ఇప్పటివరకు ఉన్న బ‌కాయిలు రూ. 727 కోట్లు మాత్ర‌మేనని వివరించారు.

మా ప్రభుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లింపులు జ‌రుగుతున్నాయని, గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన బ‌కాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. సీఎం స‌హాయ నిధి చెక్‌ల విష‌యంలో గ‌తంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, కొంతమందిపై కేసులు పెట్టామన్నారు. ప్రజా ప్ర‌భుత్వం వ‌చ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నామని, దీనివ‌ల్ల అక్ర‌మాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందన్నారు.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×