Nepal landslide fall: నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. రెండు వారాల కిందట ఆకస్మిక వరదల నుంచి తేరుకోలేదు. భారీ కొండచరియలు విరిగిపడుతున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నేపాల్‌లోని దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా చౌలానీ నది ప్రవాహానికి అడ్డుకట్టపడింది. దీంతో ఏ క్షణమైనా వరదలు వచ్చే అవకాశముందని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
నేపాల్‌లోని దార్చులా జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీని ఫలితంగా చౌలానీ నది ప్రవాహానికి అడ్డుపడింది. ఇది చాలా ప్రమాదకమని, ఏ క్షణమైనా అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమల్ రూరల్ మునిసిపాలిటీలోని భట్టార్‌లో ఈ ఘటన జరిగింది. ఫలితంగా కొండ చరియలు విరిగి వాటి శిథిలాలు నదిలోకి కొట్టుకువచ్చాయి. మరికొన్ని కొండచరియలు విరిగిపడితే నది పూర్తిగా మూసుకుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దీనివల్ల దిగువ ప్రాంతాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని దార్చులా జిల్లా పరిపాలన కార్యాలయం హెచ్చరించింది. నది ప్రవాహానికి పాక్షికంగా అడ్డుపడటంతో అత్యవసర పరిస్థితికి దారితీయవచ్చనే ఆందోళనలు పెరిగాయి. నదీ తీరాల్లో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలకు సమాచారం అందించడానికి సిబ్బందిని మోహరించారు అధికారులు.
పరిస్థితి గమనించిన సుదూర పశ్చిమ్ సీఎం ఖగ్రాజ్ భట్టా.. స్థానిక అధికారులు, భద్రతా సంస్థలను అలర్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా రెడీగా ఉండాలన్నారు. వరద విపత్తు సహాయం కోసం అత్యవసర సంప్రదింపు నంబర్లను వెల్లడించింది. చౌలానీ నది ప్రస్తుతం సాధారణ స్థాయిలో ప్రవహిస్తోందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, అవసరమైతే సమీపంలోని కమ్యూనిటీలను హెచ్చరించడానికి చమేలియా జలవిద్యుత్ భద్రతా కేంద్రం నుండి సిబ్బందిని అక్కడికి రప్పించారు.
ALSO READ: విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన
చమేలియా అనిపిలువబడే చౌలానీ నది.. అపి హిమాల్ ప్రాంతంలో ఉద్భవించింది. చివరికి నేపాల్-భారత సరిహద్దులో భాగమైన మహాకాళి నదిలో కలుస్తుంది. ఇప్పటికే రెండువారాల కిందట సంభవించిన తీవ్ర వరదలు, ఆ తర్వాత పరిణామాలతో నేపాల్ సహాయ చర్యలు చేస్తున్న తరుణంలో తాజా హెచ్చరిక వెలువడింది. ఇటీవలి వరదల కారణంగా వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా వాటిల్లింది. ప్రస్తుతం సహాయక పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి.
Today, a large landslide has partially blocked the Chaulani River in Api Himal Rural Municipality, Darchula District, Sudurpashchim Province, Nepal.
Authorities are urging residents downstream to remain alert amid the risk of sudden flooding. pic.twitter.com/7UuxGPsDjg
— Weather Monitor (@WeatherMonitors) September 4, 2026