BigTV English

Abdulla Shahid: ‘మాల్దీవుల్లో వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది’.. ముయిజ్జా అన్ని అబద్ధాలే!

Abdulla Shahid: ‘మాల్దీవుల్లో వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది’.. ముయిజ్జా అన్ని అబద్ధాలే!


Maldives EX-Minister Slams Muizzu’s Claims Of Withdrawing Indian Troops: మాల్దీవుల్లో వేలాది మంది భారతీయ సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. తమ దేశ భూ భాగంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరని అయన ఎక్స్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

‘వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది’ అని అధ్యక్షుడు ముయిజ్జు చేసిన ప్రకటనలు అబద్ధాల తంతులో మరొకటి మాత్రమే. ప్రస్తుత పరిపాలన నిర్దిష్ట సంఖ్యలను అందించడంలో అసమర్థతులని గొప్పగా చెప్పవచ్చు. కానీ.. దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు లేరు. పారదర్శకత ముఖ్యం, సత్యం గెలవాలని అబ్దుల్లా షాహిద్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.


ఎన్నికల సమయంలో తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారని అందులో ఇది కూడా ఒకటని విరచుకుపడ్డారు.

Read More: ఈ మారణహోమం ఆగేదెప్పుడో..! నేటితో ఉక్రెయిన్ వార్ మొదలై రెండేళ్లు..

ఎన్నికల సమయంలో మయిజ్జు ఓట్లు పొందేంకు అధికారంలో ఉన్న మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (MDP) వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ తెలిపింది. కానీ.. భారత్ తో అలాంటి ఒప్పందాలు ఏమి జరగలేదు. అది తను అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని తాజాగా అబ్దుల్లా షాహిద్ తెలిపారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాడని షాహిద్ అరోపించారు.

చైనా అనుకూల వ్యక్తిగా పేరొందిన మహ్మద్ మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. ఆ దేశంలోని మూడు వైమానిక స్థావరాలలో ఒకదానిలో పనిచేస్తున్న బలగాలు మార్చి 10 నాటికి ఉపసంహరించుకుంటాయని, మిగిలిన రెండు స్థావరాలలోని వారు మే 10 నాటికి ఉపసంహరించుకుంటారని ముయిజ్జు ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం 80 మందితో కూడిన భారత సైన్యం అక్కడ మోహరించింది. భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది.

Related News

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Nobel Prize: నోబెల్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత..? వారికి లభించే గుర్తింపు ఏంటి..?

Big Stories

×