BigTV English

Maruti Suzuki Car: 35 కి.మీ మైలేజీ గల కారు ధరను తగ్గించిన మారుతి.. ఎంతంటే?

Maruti Suzuki Car: 35 కి.మీ మైలేజీ గల కారు ధరను తగ్గించిన మారుతి.. ఎంతంటే?


Maruti Suzuki Alto K10: తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే కార్లను కొనేందుకు కొందరు ప్లాన్ చేస్తుంటారు. కానీ వాటి ధరలు అధికంగా ఉండటంతో వారి ప్లాన్ మార్చుకుంటుంటారు. ఎప్పుడైనా డిస్కౌంట్ ద్వారా రేట్లు తగ్గింతే అప్పుడు కొనుక్కోవాలని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా తన మోడల్‌లో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించి సర్ప్రైజ్ అందించింది. మరి ఆ మోడల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.


మారుతి సుజుకి తన ఆల్టో కె 10 మోడల్‌లోని కొన్ని వేరియంట్లపై మంచి తగ్గింపును అందిస్తోంది. VXi AGS, VXi+ AGS వంటి వేరియంట్‌ల ధరలపై దాదాపు రూ.5 వేలు తగ్గాయి. దీంతో ఈ వేరియంట్ల ధరలు ప్రస్తుతం రూ.5.56 లక్షలు, రూ.5.85 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరలో అందుబాటులో ఉన్నాయి.

READ MORE: కేవలం రూ. 10 లక్షలకే 7- సీటర్ కారు.. అద్భుతమైన మోడల్స్ ఇవే.. ఓ లుక్కేయండి!

అయితే ఈ వేరియంట్లు కాకుండా ఆల్టో కె 10కి సంబంధించిన ఇతర వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు. కాగా ఈ మోడల్ బేస్ ధర రూ.3.99 లక్షల నుంచి స్టార్ట్ అయి రూ. 5.96 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇకపోతే ఈ హ్యాచ్‌బ్యాక్‌ Std, LXi, VXi, VXi+ వంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

కాగా ఈ ఆల్టో కె 10లో అతి పెద్ద ఫీచర్ ఇంధన సామర్థ్యం గల ఇంజన్. ఇది పెట్రోల్, సిఎన్జీ వంటి రెండింటిలోనూ అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. ఇందులో 999cc 1లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది గరిష్టంగా 67bhp శక్తినీ, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

READ MORE: సొంత కార్లు ఆ దేశంలో ఎక్కువ..

ఇది లీటర్‌కు 24 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదని కంపెనీ చెబుతోంది. అలాగే సిఎన్జీ వేరియంట్‌ 35 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. వీటితో పాటు ఆల్టో కె10 లో మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల తగ్గింపు కోసం ఎదురుచూసే వారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి.

Tags

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×