E-Paper
Advertisement

అమ్మో.. అప్పులు, గోల్డ్ లోన్‌తో తీర్చేద్దాం.. బ్యాంకులకు కొత్త తలనొప్పి?

అమ్మో.. అప్పులు, గోల్డ్ లోన్‌తో తీర్చేద్దాం.. బ్యాంకులకు కొత్త తలనొప్పి?
Advertisement

ఇప్పుడున్న టైమ్‌లో ఎమర్జెన్సీగా క్యాష్ కావాలంటే అందరి మైండ్‌లో వచ్చే ఫస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్. ఇంట్లో ఉన్న గోల్డ్ జ్యువెలరీని పట్టుకెళ్తే పది నిమిషాల్లో అకౌంట్‌లో డబ్బు పడిపోతోంది. అందుకే ల్యాండర్స్ కూడా వేరే లోన్స్ కంటే గోల్డ్ లోన్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సెక్యూరిటీ ఉంటుంది కదా అని ఊరికే ఆఫర్లు ఇచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఆర్‌బీఐ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆగస్టు 2026 నాటికి బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ ఏకంగా 83 శాతం పెరిగి 5.6 ట్రిలియన్ రూపీస్‌కి చేరాయి. ఇక ఎన్‌బీఎఫ్‌సీల విషయానికొస్తే.. 69 శాతం గ్రోత్‌తో 3.6 ట్రిలియన్ రూపీస్ మార్క్‌ని దాటేశాయి.

అప్పులు తీర్చడానికే.. గోల్డ్ లోన్

అసలు గోల్డ్ లోన్స్ వల్ల వచ్చిన చిక్కేంటంటే.. జనాలు పాత అప్పులు తీర్చడానికి కొత్తగా గోల్డ్ లోన్స్ వాడుతున్నారు. ఆల్రెడీ వేరే ఇతర పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు 90 రోజుల కంటే ఎక్కువ టైమ్ కట్టకుండా పెండింగ్‌లో ఉన్నవాళ్లకే.. గడిచిన సంవత్సరంలో ఏకంగా 4.7 ట్రిలియన్ రూపీస్ వర్త్ గోల్డ్ లోన్స్ డిస్‌బర్స్‌ అయ్యాయి. అంటే, పాత అప్పులు కట్టలేక, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడటానికి జనాలు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు.

ఒకే కుటుంబం.. వేర్వేరు బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు

Advertisement

మరో డేంజర్ సిగ్నల్ ఏంటంటే.. ఒకే కుటుంబం మల్టిపుల్ కంపెనీల నుంచి లోన్లు తీసుకుంటోంది. దీనివల్ల కస్టమర్ల డెప్త్ కెపాసిటీ కంట్రోల్ తప్పుతోంది. రేపు పొద్దున వాళ్ల ఆదాయం ఏమాత్రం తగ్గినా, ఏ ఒక్క లోన్ కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. ఈ సైకిల్ మార్కెట్‌కి అస్సలు మంచిది కాదనేది ఎకనామిస్టుల మాట.

బంగారం ధర పతనమైతే?

కస్టమర్ డబ్బులు కట్టకపోతే బంగారం వేలం వేసి రికవరీ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ, ప్రతిసారీ ఆక్షన్ చేయడం అనేది లీగల్ ప్రాసెస్‌తో కూడుకున్నది. పైగా కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌కి మైనస్. అంతకంటే డేంజర్ ఏంటంటే.. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్న బంగారం ధరలు ఏదైనా కారణంతో సడన్‌గా ఒక 10 నుంచి 15 శాతం పడిపోతే, తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే లోన్ అమౌంటే ఎక్కువైపోతుంది. అప్పుడు కస్టమర్లు లోన్ కట్టడం మానేసి బంగారాన్ని కంపెనీకే వదిలేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ గోల్డ్ లోన్ బూమ్ వెనుక ఉన్న డెట్ ట్రాప్‌పై ఆర్‌బీఐ కూడా కన్ను వేసి ఉంచే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Also Read: బంగారం ధరలు మరింత కిందకి? ఇప్పుడు కొనాలా? వద్దా?

Tags

Related News

రేపటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి..ఎమర్జెన్సీ సేవింగ్స్ వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్!

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు..ఈ 6 తప్పులు అస్సలు చేయెద్దు!

నామినీ చనిపోతే డబ్బు ఎవరికి చెందుతుంది? బ్యాంకుల కొత్త రూల్స్!

బంగారం ధరలు మరింత కిందకి? ఇప్పుడు కొనాలా? వద్దా?

క్రెడిట్ కార్డ్ మాన్యువల్ ఫీజుకు బై-బై..లైఫ్‌టైమ్ ఫ్రీగా వాడుకునేందుకు మార్గాలు!

ఒక మనిషికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? నిపుణులు ఏమంటున్నారు?

పండగ వేళ మహిళలకు శుభవార్త.. భారీ పడుతున్న బంగారం-వెండి ధరలు

Big Stories

Advertisement
×